అన్వేషించండి

IND vs NZ: బ్యాటింగ్‌ మనదే.. భారీ స్కోరు ఖాయమే!

ODI World Cup 2023: ముంబయిలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా  బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగింది.

India vs New Zealand Score: ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుందని... ఇప్పుడు తాము అదే నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నామన్న రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు నిజమయ్యాయి. ముంబయిలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా  బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగింది. భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని భారీ స్కోరు చేస్తే సగం విజయం సాధించినట్లేనని మాజీలు అంచనా వేస్తున్నారు. వాంఖడేలో ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం కష్టంగా మారనుంది. కొత్త బంతితో తీవ్ర నష్టాన్ని కలిగించే బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. రోహిత్‌ శర్మ మరోసారి రాణిస్తే టీమిండియాకు ఇక ఎదురుండదు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 503 పరుగులు... గిల్‌ 270 పరుగులు చేశారు. మీరు మరోసారి విధ్వంసకర ఓపెనింగ్‌ ఇస్తే భారత్‌ గెలుపు ఖాయమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో 593 పరుగులు చేసి సచిన్‌ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కె.ఎల్. రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది.

ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్‌..మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు దాదాపుగా బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. గత ప్రపంచకప్‌ మ్యాచుల్లోనూ వాంఖడే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ దక్షిణాఫ్రికా రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసింది.
 
అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు ఉన్నా సెమీస్‌ ఫోబియా అభిమానులను కలవరపెడుతోంది. ICC టోర్నీల్లో భారత్‌పై కివీస్‌కు ఘనమైన రికార్డు ఉన్నా ఈ మ్యాచ్‌లో వాటన్నింటినీ పటాపంచలు చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన కసిగా ఉంది.
 
ఈ మహా సంగ్రామంలో వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన అదే ఊపుతో కివీస్‌ను మట్టికరిపించాలని భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌ను భారత్‌ సాధిస్తుందన్న అంచనాలు భారీగా ఉండడంతో ఆ ఒత్తిడిని టీమిండియా అధిగమించాల్సి ఉంది. జట్టు సభ్యులను ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడంపై కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టి సారించారు. వాంఖడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. 
 
భారత్‌ ఫైనల్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్. 
 
న్యూజిలాండ్ ఫైనల్‌ 11: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్,  గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ,
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Embed widget