Siraj Vs Harshit: హర్షిత్ కోసం సిరాజ్‌ను పక్కన పెట్టారు - బోర్డు రాజకీయాలపై సోషల్ మీడియాలో ఫైర్
Team India: బోర్డులో రాజకీయాల వల్ల సిరాజ్‌కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. రెండేళ్లుగా జట్టు తరఫున అత్యధిక అంతర్జాతీయ ఓవర్లు బౌల్ చేసిన ఆటగాడిని పక్కన పెట్టడం సరికాదంటున్నారు.

Team India News: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడం చాలామందిని షాక్‌కు గురి చేసింది. చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సిరాజ్‌ను పక్కన పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2023 నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసిన పేసర్‌గా నిలిచాడు. అయితే అలాంటి పేసర్‌ను పక్కన పెట్టడంపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బౌలింగ్‌లో తాను అంతగా ప్రభావం చూపించ లేకపోవడంతోనే పక్కన పెట్టినట్లు తెలిపాడు. ముఖ్యంగా బంతి కొంచెం పాత పడ్డాక సిరాజ్ అంత ఎఫెక్టివ్‌గా కనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన సిరాజ్ 71 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో బోలెడంత అనుభవం ఉంది. అయితే వన్డేల్లో ఎలాంటి అనుభవం లేని హర్షిత్ రాణాను బ్యాకప్ పేసర్‌గా తీసుకోవడంపై పలు విమర్శలు వ్యక్తవమవుతున్నాయి. సిరాజ్ గణాంకాలను ఏకరువు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Only two Indians in this list.
— Aakash Chopra (@cricketaakash) January 18, 2025
Only one Indian fast bowler.
Most ODI wickets since 01.01.2022.
His name is Md. Siraj. pic.twitter.com/2PZw53f4Rc
బుమ్రాపై డౌట్..
వెన్ను నొప్పి గాయం నుంచి కోలుకుని స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో చెప్పడం కష్టమేనని రోహిత్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా అందుబాటులో లేని స్థితిలో మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ లాంటి ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. షమీ కొత్త బంతితో మాస్టర్ అని వన్డే ప్రపంచకప్‌లో తను ఎలా రాణించాడో మనమంతా చూశామని తెలిపాడు. ఇక అర్షదీప్‌కు వన్డేల్లో అంతగా అనుభవం లేకున్నా, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ప్రెషర్ సిట్యూవేషన్‌లో బాగా బౌలింగ్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. ఇక ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తను లీడింగ్ వికెట్ టేకర్లలో ఒకడు. తనను తీసుకుంటే బౌలింగ్‌లోనూ వైవిధ్యం ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీ20ల్లోకి షమీని అందుకే తీసుకున్నాం...
సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్్ తర్వాత షమీ గాయపడ్డాడని, ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత పునరాగమనం చేశాడని రోహిత్ గుర్తు చేశాడు. మెగాటోర్నీకి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసమే తనను ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశామని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ద్వారా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుందని వ్యాఖ్యానించాడు. దీంతో మెగా టోర్నీకి షమీ సరిగ్గా సన్నద్ధమవుతాడని పేర్కొన్నాడు. బ్యాకప్‌గా హర్షిత్ రాణాను తీసుకోవడంపై వివరణ ఇచ్చాడు. తనకు అంతగా వన్డేల్లో అనుభవం లేకున్నా, చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయగలడని పేర్కొన్నాడు. మరోవైపు హర్షిత్ కోసం సిరాజ్‌ను బలిపశువు చేశారని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్ టూర్లో సిరాజ్ ఐదు టెస్టులు ఆడాడని, అదే ఫామ్ కోల్పోయి హర్షిత్ కేవలం రెండు మ్యాచ్ లకే బెంచ్ కు పరిమితమయ్యాడని గుర్తు చేశారు. కేవలం గంభీర్ ఒత్తిడితోనే హర్షిత్ కు ఈ మెగాటోర్నీలో స్థానం దక్కిందని పలువురు విమర్శిస్తున్నారు. ఏదేమైనా గత రెండేళ్లుగా జట్టు తరపున అత్యధిక ఓవర్లు బౌలింగ్ వేసినా, చివరి దశలో సిరాజ్ దెబ్బ పడిపోయిందని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

