U-19 Women T20 World Cup: విండీస్ ను వణికించిన భారత బౌలర్లు.. 44 పరుగులకే ఆలౌట్, 9 వికెట్లతో గెలుపొందిన టీమిండియా
డిఫెండింగ్ చాంపియన్ భారత్ మలేసియాలో జరుగుతున్న అండర్ -19 మహిళా టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. విండీస్ ను తొమ్మిది వికెట్లతో చిత్తు చేసింది.

India Beat West Indies In Under 19 T20 Womens world cup: ఐసీసీ అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్ లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ఈ టోర్నిలో వెస్టిండీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 13.2 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. జట్టులో కేనికా కస్సర్ (25) టాప్ స్కోరును సాధించింది. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అనంతరం టార్గెట్ ను కేవలం 4.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి 47 పరుగులు చేసి, 9 వికెట్లతో గెలుపొందింది. మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేసిన వీజే జోషిత (2/5)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తర్వాత మ్యాచ్ ను ఆతిథ్య మలేసియాతో మంగళవారం ఇదే వేదికపై ఆడుతుంది.
Joshitha VJ is the Player of the Match for her 2 wickets for just 5 runs!
— BCCI Women (@BCCIWomen) January 19, 2025
Scoreboard ▶️ https://t.co/EHIxnF1mFp#TeamIndia | #INDvWI | #U19WorldCup pic.twitter.com/5k7uhdmBWU
చెలరేగిన బౌలర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ ను భారత మహిళలు వణికించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి సత్తా చాటారు. ఆరంభంలోనే కెప్టెన్ కమ్ ఓపెనర్ సమరా రాంనాథ్ (3)ను ఔట్ చేసిన భారత మహిళలు వరుసగా నైజని, జహజారా, బ్రియాన్నలకు డకౌట్ చేసి షాకిచ్చారు. ఈ దశలో ఓపెనర్ కాలెందర్ (12)తో కలిసి కాసర్ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అయితే కాసేపటికి కాలెందర్ రనౌట్ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగడంతో విండీస్ ఏమాత్రం పోటినివ్వలేకపోయింది. కనీసం పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక చతికిలి పడింది. బౌలర్లలో పరుణికా సిసోడియా మూడు వికెట్లతో రాణించింది. జోషితాతోపాటు ఆయుషి శుక్లాలకు రెండేసి వికెట్లు దక్కాయి. భారత ఫీల్డర్లు చురుకుగా ఫీల్డులో వ్యవహరించడంతో మూడు రనౌట్లు కూడా నమోదయ్యాయి. దీంతో 44 పరుగులకే విండీస్ చాప చుట్టేసింది.
త్రిష విఫలం..
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపిన తెలుగు ప్లేయర్ గొంగిడి త్రిష తర్వాతి బంతికే క్లాక్స్టన్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ దశలో వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కమలిని (13 బంతుల్లో 16 నాటౌట్, 3 ఫోర్లు), సనికా చాల్కే (11 బంతుల్లో 18 నాటౌట్, 3 ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. వీరిద్దరూ కేవలం 25 బంతుల్లోనే 43 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసినట్లయ్యింది. తర్వాతి మ్యాచ్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
Also Read: Manu Bhaker: మను బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబసభ్యులు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

