Sri Ram Navami 2024: రాముడిది ఇలాంటి ఫొటో ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు!
Sri Rama Pattabhishekam 2024: దేవుడు, పూజలు, ఇంట్లో ఉంచే ఫొటోలు విగ్రహాల గురించి సందేహాలు అనంతరం. అలాంటి సందేహాల్లో ఒకటి శ్రీరాముడి పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉండొచ్చా? ఇంతకీ ఉండొచ్చా?

Sri Ram Navami 2024: ఏప్రిల్ 17 శ్రీరామనవమి..ఈ సందర్భంగా రామచంద్రుడికి గురించి ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలు అందిస్తోంది. శ్రీరామ పట్టాభిషేకం ఫొటో గురించి ఆశక్తికర విషయాలు మీకోసం...
ఓం శబ్దంతో సమానం ఈ ఫొటో!
ఓం అనే శబ్దం నుంచి పుట్టిన ప్రతి శబ్ధానికీ ప్రత్యేక శక్తి ఉంటుంది
అందుకే అ,ఉ,మ తో కలసిన ప్రతి బీజాక్షరానికీ అద్భుతమైన శక్తి ఉంటుంది
బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను ఉచ్ఛరించినప్పుడు శరీరంలో ప్రత్యేక శక్తి పుడుతుంది
ఆ శక్తితో అన్ని సంకల్పాలు నెరవేరుతాయి. అంత శక్తివంతమైనది ఓంకారం
అయితే 'ఓం' కారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయలేరు కదా..అందుకు ప్రత్యామ్నాయమే శ్రీరామ పట్టాభిషేకం ఫొటో. ఈ ఫొటో ఇంట్లో ఇంటే ప్రతికూల శక్తులు రావని విశ్వసిస్తారు.
Also Read: మూడు పూటలా మూడు శ్లోకాలు చాలు - సమస్యలన్నీ తీరిపోతాయ్!
శత్రుభయం తొలగించే రూపం
అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతాదేవి..’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమంతుడు. అంటే.. అకార ఉకార మకార నాద స్వరూపమైన హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రుడి పట్టాభిషేకం ఫొటో. శ్రీరామ పట్టాభిషేకం ఫొటోని పూజిస్తే ఓంకారానికి పూజచేసినంత ఫలం దక్కుతుంది. వీరరాఘవుడు, విజయ రాఘవుడు అని పిలిచే రామచంద్రుడు ఎప్పుడూ కోదండంతో కనిపిస్తాడు. అపజయం అనేదే తెలియని రాముడి పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉంటే నిర్భయత్వం, శత్రుభయం ఉండదంటారు పండితులు.
Also Read: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!
నిత్యం ఈ మంత్రం 11 సార్లు పఠిస్తే..!
ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రానివారు, నిత్యం ఏదో ఆందోళనల్లో ఉండేవారు, ఎంత కష్టపడినా ఫలితం పొందలేనివారు... నిత్యం శ్రీరామ పట్టాభిషేకం శ్లోకాలు పఠిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. రోజూ ఉదయాన్నే 21 లేదా 11 సార్లు పఠించాలి.
Also Read: Sri Rama Navami Date 2024: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!
పారాయణం చేయాల్సిన శ్రీ రామ పట్టాభిషేకం శ్లోకాలు
నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||
న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||
న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||
నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||
గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||
శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉండకూడదు అనే ప్రచారాన్ని నమ్మొద్దు...ఈ ఫొటో నిత్యం దర్శించుకోవడం, పట్టాభిషేకం శ్లోకాలు చదువుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయి...
Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

