(Source: Poll of Polls)
Hometown Web Series: ఆహాలో 'హోమ్ టౌన్'... ఈటీవీ విన్ '90స్' తరహాలో సక్సెస్ అవుతుందా?
Hometown Web Series Streaming Date: రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్రల్లో ఆహా ఓటీటీ 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. మరి ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Hometown Web Series Telugu Release Date, Cast And Crew: ఆహా ఓటీటీ కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. దాని పేరు 'హోమ్ టౌన్'. మరి, ఈ సిరీస్ ఈటీవీ విన్ బ్లాక్ బస్టర్ ఒరిజినల్స్ '90స్' తరహాలో ఆహాకు భారీ విజయం అందిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా '90స్' వెబ్ సిరీస్ ప్రస్తావన తీసుకు రావడానికి కారణం ఏమిటంటే?
'90స్' నిర్మించిన నవీన్ మేడారం నుంచి
'90స్' వెబ్ సిరీస్ నిర్మాత నవీన్ మేడారం. 'బాబు బాగా బిజీ', 'సిన్' వెబ్ సిరీస్, 'డెవిల్' సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన '90స్'తో నిర్మాతగా మారారు. ఓటీటీ అంటే అడల్ట్ సీన్స్, బూతు డైలాగ్స్ అని ముద్ర పడిన తరుణంలో కుటుంబం అంతా కలిసి చూసే చక్కటి వినోదాత్మక, కుటుంబ వెబ్ సిరీస్ తీయవచ్చని ఆయన నిరూపించారు. ఇప్పుడు ఈ 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ నిర్మాత కూడా నవీన్ మేడారమే. అందుకే ఆ వెబ్ సిరీస్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. పైగా ఇది కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్.
రాజీవ్ కనకాల, ఝాన్సీ భార్యాభర్తలుగా!
'హోమ్ టౌన్'లో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ కం ఆర్టిస్ట్ ఝాన్సీ భార్యాభర్తలుగా నటించారు. ఇంకా ఇందులో ప్రజ్వల్ యద్మ, సాయిరాం, అనిరుద్, జ్యోతి ఇతర ప్రధాన కారణం. దీనికి శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు.
Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!
View this post on Instagram
'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే... ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రేమ, బాల్యం, స్నేహానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. తొలి ప్రేమతో పాటు తొలి స్నేహితుడిని, బాల్యంలో తొలినాళ్ళను మర్చిపోవడం కష్టం. ఆ అంశాలను స్పృశిస్తూ ఈ వెబ్ సిరీస్ తీశారని ఆహా ఓటీటీ పేర్కొంది. ఫస్ట్ ఫైట్, ఫస్ట్ హార్ట్ బ్రేక్ విషయాలను కూడా టచ్ చేశారట. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు తమ జీవితంలో నోస్టాలజీ మూమెంట్స్ గుర్తు చేస్తుందని తెలిపారు.
ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ షురూ!
'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం ప్రొడ్యూస్ చేశారు. దీనికి సినిమాటోగ్రఫీ: దేవ్ దీప్ గాంధీ కుందు, సంగీతం: సురేష్ బొబ్బిలి, కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీదేవి తేటలి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?





















