Bollywood Actor: స్టార్ హీరోకి 55 కేసులు, 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకరు ఒకప్పుడు 55 కేసులు, రూ.90 కోట్ల అప్పు, చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారన్న విషయం తెలుసా?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) 82 ఏళ్ల వయసులోనూ సక్సెస ఫుల్ నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నారు. అలాగే అప్ కమింగ్ యాక్టర్స్ కి ఆయన మూవీ జర్నీ స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. అయితే అమితాబ్ బచ్చన్ అనగానే ఇప్పటికి ఆయన అద్భుతంగా నటిస్తున్న తీరు, ఇండియన్ సినిమా చరిత్రలో దిగ్గజ నటీనటులలో ఆయన కూడా ఒకరు అన్న విషయం గుర్తొస్తుంది. అయితే ఈ స్టార్ డమ్ వెనుక ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఆయన కెరీర్ అత్యంత దారుణమైన సిచువేషన్ లో ఉంది. అమితాబ్ కంపెనీ దివాలా తీయడంతో ఏకంగా 90 కోట్ల అప్పుల్లో కూరుకు పోయారు. మరోవైపు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అలాగే ఆయనపై 55 కేసులు నమోదయ్యాయి. అప్పటికే ఆయన ఎంతోమంది పెద్ద తలకాయలకు సన్నిహితుడు, బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన హీరో అయినప్పటికీ, అలాంటి క్లిష్ట సమయంలో అమితాబ్ ను కాపాడింది మాత్రం ఒకే ఒక్కరు.
అమితాబ్ బచ్చన్ కి దారుణమైన అవమానం
సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ పీక్స్ కి చేరిన తర్వాత సడన్ గా కుప్పకూలితే ఎలా ఉంటుందో ఇప్పటిదాకా ఎంతోమంది నటీనటుల జీవితాల్లో చూసాం మనం. అచ్చం అమితాబ్ జీవితంలో కూడా ఇలాగే జరిగింది. ఓ పాత ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన సమయం గురించి మాట్లాడారు. ఆ టైంలో తన కంపెనీ దివాలా తీయడంతో సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. 90 కోట్ల రూపాయల అప్పును వసూలు చేయడానికి బ్యాంకులు తన ఇంటిని కూడా జప్తు చేశాయని అమితాబ్ వెల్లడించారు.
Also Read: రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్ చిరంజీవి... అందులో నిజం ఎంతంటే?
దీని గురించి ఆయన మాట్లాడుతూ "నిజానికి మా ఆస్తులు అన్నింటినీ అటాచ్ చేశారు. అయినప్పటికీ దాదాపు 90 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు నాపై దాదాపు 55 లీగల్ కేసులు ఉన్నాయి. ప్రతిరోజూ అప్పిచ్చిన వాళ్లు ఇంటి గుమ్మం దగ్గర నిలబడడం చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపించేది. అయితే ఎప్పుడైనా ఓ మనిషి పొరపాటున తప్పు చేస్తే, ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా సరే తప్పుగానే కనిపిస్తుంది. జనాలు నమ్మకం కోల్పోతారు. వాళ్ళ ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడరు. కనిపించే తీరు, వేసుకునే బట్టలు కూడా సరిగ్గా లేవని అనుకుంటారు" అంటూ చెప్పుకొచ్చారు.
అమితాబ్ ను కాపాడింది ఆయన ఒక్కడే
అదే ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ "ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది జనాలు ఇక నా జీవితం ముగిసినట్టేనని అనుకున్నారు. అంతేకాకుండా బ్రతికుండగానే పాతి పెడదామనుకున్నారు. చేతిలో ఒక్క సినిమా లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. పైగా 90 కోట్ల అప్పులు, అవన్నీ కూడా కంపెనీకి సంబంధించినవే. అలాంటి కష్ట సమయంలో జనాలు తనతో పాటు తన భార్య పట్ల ఏదో శత్రుత్వం ఉన్నట్టుగా దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించే వారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక వేరే మార్గం లేదు అనుకుంటున్న టైంలో యశ్ చోప్రా మూవీ ఆఫర్ ఇవ్వడంతో ఈ గండం నుంచి గట్టెక్కారు అమితాబ్ బచ్చన్. 'మోహబ్బతే' అనే రొమాంటిక్ డ్రామా సూపర్ హిట్ అయ్యాక, అమితాబ్ సెకండ్ ఇన్నింగ్స్ ని సక్సెస్ ఫుల్ మొదలు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయనకు సెకండ్ లైఫ్. ఇక ఆ తర్వాత మళ్లీ అమితాబ్ ఎలా విజృంభించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.





















