Sankranti celebrations: కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
Kodi pandelu: ఏపీలో కాలు దువ్వుతున్న పందెం కోళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

Cock fights: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి కోడిపందేల బరుల్లోనే కనిపిస్తోంది. పండుగ సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడి పందేల కోసం ఉభయ గోదావరి, కృష్ణా, కాకినాడ, గుంటూరు వంటి జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, గ్రామాల్లో బరులు భారీగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బరుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరగడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గతేడాది 200 వరకు ఉన్న బరులు, ఈసారి 450 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో బరి వద్ద కోట్లాది రూపాయల పందేలు సాగనున్నాయి.
పందేల కోసం నిర్వాహకులు ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‌లో హంగులు అద్దారు. 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో బరులు ఏర్పాటు చేసి, విదేశీ పర్యాటకులు, ప్రముఖుల కోసం వీఐపీ లాంజ్‌లు, ఏసీ గదులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, రాత్రి వేళల కోసం ఫ్లడ్ లైట్లు సిద్ధం చేశారు. కేవలం పందేలే కాకుండా, గుండాట, పేకాట వంటి జూద క్రీడలకు కూడా ప్రత్యేక స్థావరాలు వెలిశాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి పందెగాళ్లు తరలి వస్తుండటంతో ఇప్పటికే గోదావరి జిల్లాల్లోని హోటల్ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి.
రాజమండ్రి రూరల్ : కోడి పందాలు నిర్వహణకు బరులు రెడీ.. pic.twitter.com/vXhIBFc7ku
— vijaybabu91213 (@vijaybabu91213) January 14, 2026
పందెం కోళ్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. జాతి కోళ్లకు రూ. 30 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా కత్తులు కట్టి నిర్వహించే పందేల కోసం పందెం రాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వాహకులు విజేతలకు బుల్లెట్ బైకులు, కార్లను బహుమతులుగా ప్రకటిస్తూ పందెగాళ్లను ఆకర్షిస్తున్నారు. కేవలం భోగి రోజే సుమారు రూ. 70 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ సారి నెల్లూరు, రాయలసీమలో కూడా కోడిపందేల బరులు ఏర్పాటు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కొంత మంది వీడియోలు పోస్టు చేస్తున్నారు.
పులివెందులలో కోడి పందాలకు బరులు సిద్ధం చేసిన కూటమి నేతలు
— Baggidi Sudharsen Reddy (@sudhareddydmm) January 13, 2026
నియోజకవర్గ శివారులోని మూడు ప్రాంతాలలో కోడి పందాల బరులు
కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పులివెందుల డీఎస్పి
ఎక్కడైనా పందేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం వస్తే బరులను దున్నిచ్చేందుకు సిద్ధమంటూ వెల్లడి pic.twitter.com/3E2W2flJqR
హైకోర్టు ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో మారుమూల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎలూరు, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల బరులను పోలీసులు ధ్వంసం చేయడమే కాకుండా, కోడి కత్తులను తయారు చేసే కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జూదం సొమ్మును స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సంప్రదాయం పేరుతో జంతుహింసకు పాల్పడకూడదని కలెక్టర్లు, ఎస్పీలు స్పష్టం చేస్తున్నారు.





















