అన్వేషించండి

YS Jagan vs AP Government: జగన్ రప్పా రప్పా హెచ్చరికలకు ఏపీ ప్రభుత్వం భయపెడుతోందా? - ఇలాంటి అభిప్రాయం ఎందుకు వస్తోంది?

AP government: జగన్‌కు ఏపీ ప్రభుత్వం భయపడుతోందని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనలకు సోషల్ మీడియాలో ఎక్కువ పాజిటివ్ స్పందన వస్తోంది.జగన్‌కు ప్రభుత్వం భయపడుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Jagan warnings to AP government:  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై తీసుకుంటున్న చర్యల వేగంపై భిన్న రకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం, వివేకా హత్య కేసు, రఘురామ కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ వంటి సున్నితమైన అంశాల్లో జగన్ పాత్రపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేయడంతో సోషల్ మీడియాలో కొత్త వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం జగన్‌కు భయపడుతోందా అనే సందేహాలను కొందరు లేవనెత్తుతున్నారు. 

చట్టబద్ధమైన పాలన అంటున్న టీడీపీ 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం అంటే కక్షసాధింపు కాదని, చట్టబద్ధత అని బలంగా నమ్ముతున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. గత వైసీపీ హయాంలో జరిగినట్లుగా అర్థరాత్రి అరెస్టులు, ఆధారాలు లేని అక్రమ కేసులు బనాయించడం వంటి రాజ్యాంగ విరుద్ధ పనులకు తావు ఇవ్వకూడదన్నది ఆయన స్పష్టమైన ఆలోచన అని..  ఏ చర్య తీసుకున్నా అది న్యాయస్థానాల్లో నిలబడాలని, నిందితులు చట్టం నుంచి తప్పించుకునే చిన్న అవకాశం కూడా ఉండకూడదని భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే అవినీతి ఆరోపణలు ఉన్న చోట సిట్ )ల ద్వారా లోతైన విచారణ చేయిస్తూ, పక్కా ఆధారాల సేకరణకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. 

జగనే భయం నీడలో ఉన్నారంటున్న టీడీపీ 

కేసుల విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని కొందరు భయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇది నిజానికి నిందితుల చుట్టూ చట్టపరమైన ఉచ్చును పటిష్టం చేసే వ్యూహం అని టీడీపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.  అదే సమయంలో  జగన్ మోహన్ రెడ్డినే భయం నీడలో ఉన్నారని అంటున్నారు.  ఒకప్పుడు రాష్ట్రమంతటా పర్యటించిన ఆయన, ఇప్పుడు వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఏపీలో కనిపిస్తూ, మిగిలిన సమయం బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమవుతున్నారని గుర్తు చేస్తున్నారు.  గతంలో గర్జించిన వైసీపీ సీనియర్ నేతలు సైతం నేడు బయటకు వచ్చి మాట్లాడటానికి సాహసించడం లేదని..  ఇది  వారి భయాన్ని సూచిస్తోందంటున్నారు.  

ఏపీ వెంకటేశ్వరరావుది ప్రత్యేక ఏజెండా? 

ఏబీ వెంకటేశ్వరరావు వంటి బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు అసహనం వ్యక్తం చేయడం వెనుక గతంలో వారు అనుభవించిన వ్యక్తిగత వేధింపుల ఆవేదన ఉండవచ్చునని టీడీపీ నేతలంటున్నారు.  కానీ, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం భావోద్వేగాల మీద కాకుండా, కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే అడుగులు వేయాల్సి ఉంటుంది. విచారణలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది నిందితులకు పొలిటికల్ ట్రాప్ గా మారి, వారు బాధితులుగా చెప్పుకునే అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఈ చట్టబద్ధమైన విధానం వల్ల విచారణ కాస్త ఆలస్యంగా అనిపించినా, తుది ఫలితం మాత్రం పక్కాగా ఉంటుందని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుండి తప్పించుకోలేరనే భరోసాను ప్రజల్లో కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా కసరత్తు చేస్తోంది. ఇది భయం కాదు, వ్యూహాత్మకమైన మౌనంగా టీడీపీ వర్గాలు కవర్ చేసుకుంటున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
AP Assembly: అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget