Hyderabad Love Story: యువకుడితో వెళ్లిపోయిన ఇద్దరు పిల్లల తల్లి - వెదుకుతున్న భర్త - హైదరాబాద్‌లో ఛేజింగ్!
Hyderabad: చదువుకోమని హైదరాబాద్ పంపితే ఓ యువకుడి యాప్‌లోఇద్దరు పిల్లల తల్లిని ప్రేమలో పడేశాడు. ఆమె తీసుకెళ్లిపోయాడు. భార్య కోసం ఆ భర్త హైదరాబాద్ అంతా గాలిస్తున్నాడు.

Lovers story: హైదరాబాద్ ఆక్సీజన్ పార్కులో లవర్స్ అంతా హడావుడిగా ఉన్న సమయంలో కొంత అలజడి రేగింది. ఓ జంటను పట్టుకోవడానికి ఓ యువకుడు పరుగులు పెట్టాడు. అతన్ని చూసి ఓ జంట.. బైక్ మీద పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే అతను వేగంగా వచ్చి బైక్ ను పట్టుకోవడంతో.. బైక్ వదిలేసి ఆ జంట పారిపోయారు.ఆ యువకుడు బైక్ ను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కథంతా చెప్పాడు. ఆ కథ విని... పాపం అనుకున్న పోలీసులు ఆ జంట కోసం వెదుకుతామని హామీ ఇచ్చారు.
ఆక్సిజన్ పార్కు నుంచి పారిపోయిన ఆ జంటలో యువతి ఈ యువకుడి భార్య. ఓ యాప్ లో పాతికేళ్లు కుర్రాడు పరిచయం కావడంతో అతడితో వెళ్లిపోయింది. వారి ఆచూకీ తెలుసుకుని వస్తే తప్పించుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కు చెందిన మిరియం పల్లి పేరయ్య కుమారుడు గోపి ను కంప్యూటర్ ట్రైనింగ్ కొరకు హైదరాబాద్ కు పంపాడు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు హాస్టల్ లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. వచ్చి పని చేయకుండా డేటింగ్ యాప్‌లలో ఎవరైనా దొరుకుతారా అని గాలం వేశాడు. చివరికి ఓ యాప్ లో గోపికి వరంగల్ జిల్లా బావోజిగూడెం కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి సుకన్య పరిచయం అయింది. గోపీ వయసు పాతికేళ్లు కాగా.. ఆమె వయసు ముఫ్పై ఏళ్లు పైనే. వీరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు.. ఇది గమనించిన భర్త జయరాజ్ సుకన్యను మందలించాడు. దీంతో ఇద్దరూ లేచిపోవాలని నిర్ణయించుకున్నారు.
గత నెల 5 వతేది సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిని కలవడానికి నగరానికి వచ్చింది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. అయితే పిల్లలు తల్లి కోసం ఏడుస్తూండటంతో వీరి పై నిఘా ఉంచి వెంబడించిన భర్త జయరాజు వీరిని అడ్డగించాడు.. దీంతో వీరిద్దరు భైక్ ను వదిలి పరారయ్యారు.. భర్త భైక్ ను తీసుకొని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..భైక్ నెంబరు ఆధారంగా గోపి తండ్రి అయిన పేరయ్య కు సమాచారమిచ్చారు..
అయితే నెల కావస్తున్నా ఇంతవరకు వారి ఆచూకి లేదు.. ఇద్దరు ఫోన్లను స్విచ్చాప్ చేశారు. వీరిద్దరు ఎంజాయ్ చేస్తూ వాట్సప్ లో పోటోలు అప్ లోడ్ చేస్తున్నారని, వీరి ఆచూకి కై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ని ట్రేస్ చేయడానికి వీరి ID నంబర్స్ ను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read: భర్త హత్యకు సుపారీ, భార్య ప్రియుడి దాడిలో గాయపడిన డాక్టర్ మృతి - వరంగల్‌లో విషాదం





















