అన్వేషించండి

Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?

Thalliki Vandanam Scheme:అమ్మ ఒడికి అప్‌డేట్‌ వెర్శన్‌గా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన వాటిలో సూపర్‌ సిక్స్‌ హామీలు ఒకటి. అందుకే దీనిపై ఈ బడ్జెట్‌లో ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ సూపర్‌ సిక్స్ హామీల్లో ముఖ్యమైంది తల్లికి వందన పథకం. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి మార్పులు చేర్పులు చేసి దీన్ని అమలు చేయనున్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు ఈ పథకాన్ని అందించనున్నారు. మే నెలలో తొలి విడత నిధులు మంజూరు చేయనున్నారు.

తల్లికి వందనం పథకానికి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం 9వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులకు ఈ నిధలను మేలో అందజేయనున్నారు. గతంలో ఇదే పథకం అమ్మ ఒడి పథకం పేరుతో అమలు అయ్యేది. అప్పుడు 12 వేల రూపాయలు ఇచ్చే వాళ్లు ఇప్పుడు దాన్ని 15000 వేలకు పెంచారు. గతంలో కుటుంబంలో ఎంతమంది చదువుకున్నా ఒక్కరికే పథకం అమలు చేసేే వాళ్లు ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అందరికీ ఈ పథకం వర్తింపచేయనున్నారు. 

 విద్యకు కేటాయింపులు పయ్యావుల మాటల్లోనే"గత ప్రభుత్వపు దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యావ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం, తప్పుడు విధానాలు వలన, మన రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలో పడింది..  

ఇలాంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ తనపై వేసుకున్నారు.. 'నేటి బాలలే.. రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీవడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. 

"మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే, వరి నాటండి.. దశాబ్దానికి ప్రణాళిక వేస్తే, చెట్లు నాటండి.. జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే, ప్రజలకు విద్యనేర్పండి అన్న చైనా సామెతను ప్రాతిపదికగా పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతనూ ఏ బిడ్డా విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాము. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు వంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో, మరో సూపర్ సిక్స్ హామీని అమలు వరిచే దిశగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం క్రింద 15,000 రూపాయల ఆర్థిక సహాయంను అందించనున్నాము. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ వథకాన్ని అందించడానికి కేటాయింవులు జరువుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. 

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వుస్తకాలు, యూనిఫాంలు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. 

ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంతో కూడిన విద్యా వ్యవస్థ కోసం మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించింది. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయల కేటాయింవును ప్రతిపాదిస్తున్నాను. 

ఉన్నత విద్య 
భవిష్యత్ నవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం, అందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం బలమైన, నమ్మిళిత ఉన్నత విద్యావ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య, వరిశోధన విశ్వ విద్యాలయాల స్థావన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాలలో మన రాష్ట్ర విశ్వ విద్యాలయాలను నిలవడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అందుకే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయల కేటాయింవును ప్రతిపాదిస్తున్నాను అని పయ్యావుల తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget