Prabhas Hanu Movie Budget: ఇండియాలో హయ్యస్ట్ బడ్జెట్... ప్రభాస్ 'ఫౌజీ' ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
Prabhas Imanvi Movie budget: రెబల్ స్టార్ ప్రభాస్, కొత్త హీరోయిన్ ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

Prabhas Fauji Movie Budget: ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అంటే వినపడే పేరు 'బాహుబలి 2'. ఆ సినిమాతో బడ్జెట్ లెక్కలు పెంచిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. సుమారు 400 కోట్ల రూపాయలతో 'బాహుబలి 2' తీస్తున్నారని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో అందరూ షాక్ అయ్యేలా చేస్తున్నారు ప్రభాస్.
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
ప్రభాస్ కథానాయకుడిగా 'సీతా రామం' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'ఫౌజీ' టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఆ విషయాన్ని ప్రభాస్ గానీ దర్శకుడు గానీ చిత్ర బృందం గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా బడ్జెట్ గురించి టాలీవుడ్ వర్గాలలో వినపడుతున్న సమాచారం అందరూ షాక్ అయ్యేలా చేస్తోంది.
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా బడ్జెట్ 600 నుంచి 700 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందట. హీరో సహా ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ కూడా అందులో భాగమట. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా పారితోషకం కింద అందుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాల ఖబర్. దర్శకుడు సహా మిగతా టెక్నీషియన్స్ ఇంకా ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు మరో 100 కోట్ల రూపాయలు వేసుకున్నా... సినిమా మేకింగ్ ఖర్చు ఆల్మోస్ట్ 500 కోట్లు అనుకోవాలి.
Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!
'ఫౌజీ' కథ 1940 కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా కోసం అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రొడక్షన్ డిజైన్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రొడక్షన్ డిజైన్ పక్కన పెడితే రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. ఆ వార్ సీక్వెన్స్ తెరకెక్కించడం కోసం మరింత ఖర్చు అవుతుంది. అందుకని భారీ బడ్జెట్ అవుతోందని తెలిసింది.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
ప్రభాస్ సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ బరిలో 1000 కోట్ల రూపాయలు వసూలు చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా వసూళ్లు 1100 కోట్లకు పై మాటే. 'సలార్' సినిమా సైతం 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అందుకని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఖర్చు విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్విని కథానాయికగా పరిచయం చేస్తున్నారు హను రాఘవపూడి.





















