Bandla Ganesh: షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు... బండ గణేష్ పాదయాత్ర ఎందుకు?
Bandla Ganesh Padayatra: ప్రముఖ నిర్మాత, ఒకప్పటి నటుడు, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకు ఈ పాదయాత్ర? అనేది సినీ రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది.

ప్రముఖ నిర్మాత, నటుడిగాను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలోని నాయకుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలోనూ పలువురికి ఆయన సన్నిహితుడు. ఇప్పుడు ఆయన ఓ పాదయాత్ర చేయబోతున్నారని తెలిసింది.
షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు!
Bandla Ganesh Padayatra: హైదరాబాద్ నగరానికి దగ్గరలోని షాద్ నగర్ బండ్ల గణేష్ అడ్డా. ఆ ప్రాంతంలో ఆయనకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఆయనకు కలిసి వచ్చిన ప్రాంతం అది. ఆ షాద్ నగర్ నుంచి ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి వరకు బండ్ల గణేష్ పాదయాత్ర చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఎందుకీ పాదయాత్ర? అది ఇప్పుడు!
తన ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని బండ్ల గణేష్ గతంలో పలుమార్లు తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (ఒకప్పటి టిఆర్ఎస్) పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ కండువా తీసి మరొక పార్టీలోకి రాలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి ఆయన మద్దతు పలికారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ భక్తుడిగా తనని తాను పేర్కొన్నారు బండ్ల గణేష్.
Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!
రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులతో గణేష్ బండ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాను కోరుకున్న విధంగా వాళ్లు అధికారంలోకి వచ్చారని పాదయాత్ర చేస్తున్నారా? లేదంటే మరొక అంశం ఏదైనా ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.
నిర్మాతగా మళ్లీ బిజీ కానున్న బండ్ల!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఎప్పటికీ మర్చిపోలేని 'గబ్బర్ సింగ్' సినిమా నిర్మాత బండ్ల గణేష్. అదొక్కటి మాత్రమే కాదు... మాస్ మహారాజ రవితేజతో ఆయన సినిమాలు చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా 'టెంపర్' వంటి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూస్ చేశారు. అగ్ర దర్శకులు చాలా మందికి బండ్ల గణేష్ సన్నిహితుడు. మళ్లీ నిర్మాతగా బిజీ అయ్యేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే గతంలో తీసినట్టు భారీ సినిమాలు కాకుండా కంటెంట్ బేస్డ్, లో బడ్జెట్ సినిమాలతో బండ్ల గణేష్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారట. బండ్ల గణేష్ ఎవరితో సినిమా చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. అసలు, ఆయన పాదయాత్ర సినిమాల కోసమా? లేదంటే రాజకీయ రంగంలో మరింత బిజీ అయ్యేందుకా? అనేది చూడాలి.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?





















