అన్వేషించండి

AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- ఏపీ బడ్జెట్‌లో కీలక ప్రకటన

AP Budget 2025 | అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామని ఏపీ బడ్జెట్ లో మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.

Gratuity for Anganwadi workers in Andhra Pradesh Budget 2025: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అంశంతో పాటు వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు కీలక అంశాలను పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. 

మహిళకు సాధికారత కల్పిస్తే..

అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించిన భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి పూలే మాటలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. 'ఒక మహిళకు సాధికారత కల్పిస్తే- మొత్తం సమాజాన్నే ఉద్దరించినట్లు అవుతుంది' అన్న సిద్ధాంతాన్ని దృఢంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వసిస్తారని అన్నారు. అందుకే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి ఆయన అని కితాబు ఇచ్చారు.

దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగమయ్యారని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు వని చేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాని ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే, రాష్ట్ర సంక్షేమ విధానాలను, రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందిందని పేర్కొన్నారు.  

స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ప్రక్కదారి పట్టించిందని ఆరోపించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు విఘాతం కలిగించిందని విమర్శించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా, ఈ ప్రభుత్వం ప్రస్తుతం దిద్దుబాటుచర్యలు చేపడుతోంని తెలిపారు. 

నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.), మిషన్-శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి తగిన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు పయ్యావుల. మేనిఫెస్టోలోని హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేశామని పేర్కొన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారరు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వృద్ధుల సంక్షేమానికి  4,332 కోట్ల రూపాయల కేటాయించారు.

Also Read: Good News For AP Farmers: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, మత్స్యకారులకు సాయం రెట్టింపు: బడ్జెట్‌లో పయ్యావుల కేశవ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Embed widget