అన్వేషించండి

Gas Cylinder Price Hike: పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు

LPG Cylinder Price News: ఈ నెలలో హోలీ, ఉగాది, ఈద్ (రంజాన్‌) పండుగలు ఉన్నాయి. ప్రధాన పండుగలు ఉన్న ఈ నెలలో ప్రభుత్వ చమురు కంపెనీలు LPG సిలిండర్‌ ధరలను పెంచాయి.

LPG Cylinder Price Hike From 01 March 2025: మార్చి నెలలోని పండుగ సీజన్‌లో ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెలలో... రంగుల పండుగ హోలీ, తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది, ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్‌ (ఈద్) పండుగలు ఉన్నాయి. మన దేశంలో మార్చి 02వ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది. ఈ నెలలో పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. కీలక పండుగలు & వివాహాల నేపథ్యంలో, సహజంగానే వంట గ్యాస్‌ అవసరం పెరుగుతుంది. అయితే, ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCs) ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు (మార్చి 01, 2025) నుంచి పెరిగింది, ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన LPG సిలిండర్‌ ధరలను సమీక్షిస్తాయి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తాయి. సవరించిన ధరలు ఆ నెల మొత్తం (తదుపరి నెల 1వ తేదీన సమీక్ష వరకు) అమల్లో ఉంటాయి.

OMCలు, మార్చి 01 నుంచి, ప్రజలు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌ ధరను 6 రూపాయలు పెంచాయి. దీంతో, కమర్షియల్‌ సిలిండర్ ధర  (Commercial LPG Cylinder Price Today) రూ. 1797 నుంచి రూ. 1803కి చేరుకుంది. ఇది, క్యాటరింగ్‌, రెస్టారెంట్లు సహా బయటి భోజనాలు, అల్పాహారాల ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి.. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలు ఆహార ధరలను పెంచవచ్చు.

ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధరను రూ. 1797 నుంచి రూ. 1803 కి పెంచారు. 
కోల్‌కతాలో బ్లూ సిలిండర్‌ కొత్త ధర రూ. 1907 నుంచి రూ. 1913 కి పెరిగింది. 
ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ కొత్త ధర రూ. 1749.50 నుంచి రూ. 1755.50 కి చేరింది.
చెన్నైలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ గ్యాస్ రూ. 1959 నుంచి రూ. 1965 పెరిగింది.

దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పు లేదు

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు ఈ రోజు నుంచి పెంచినప్పటికీ, చమురు కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. ఇళ్లలో వంటకు ఉపయోగించే 14.2 కిలోల బరువున్న సాధారణ LPG సిలిండర్ రేటును (Domestic LPG Cylinder Price Today) సర్కారు పెంచలేదు. గత కొన్ని నెలలుగా రెడ్‌ సిలిండర్‌ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. వాస్తవానికి, అంతర్జాతీయం ముడి చమురు & గ్యాస్‌ ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, గత కాలపు నష్టాలను పూడ్చుకునే నెపంతో, చమురు సంస్థలు 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను తగ్గిచడం లేదు. 

తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ రేట్లు

హైదరాబాద్‌లో 14.2 కేజీల గ్యాస్‌ బండ రేటు ‍‌(14 KGs Gas Cylinder Price In Hyderabad) 855 రూపాయలుగా ఉంది. విజయవాడలోనూ ‍‌(14 KGs Gas Cylinder Price In Vijayawada) ఇదే ధర చెల్లించాలి. స్థానిక రవాణా ఖర్చుల కారణంగా ఈ ధర అతి స్వల్పంగా మారే అవకాశం ఉంది.

దేశీయ & వాణిజ్య LPG సిలిండర్‌ల రేట్లను ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ iocl.com నుంచి తీసుకోవడం జరిగింది.

మరో ఆసక్తికర కథనం: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే? 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget