అన్వేషించండి

Sri Rama Navami 2024: మూడు పూటలా మూడు శ్లోకాలు చాలు - సమస్యలన్నీ తీరిపోతాయ్!

Rama Navami 2024: ధర్మమార్గంలో నడిచే శ్రీ రాముడిని భక్తివిశ్వాసాలతో ధ్యానిస్తే తీరని సమస్య ఉండదు. పూటకో శ్లోకం చొప్పున మూడు పూటలా మూడు శ్లోకాలు చదివితే చాలు ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది...

Sri Rama Navami 2024:  రామచంద్రుడు..మనిషిగా జన్మించింది రావణసంహారం కోసమో, రాక్షస సంహారం కోసమో కాదు... ధర్మం అంటే ఏంటి? ఎలా ఆచరించాలి? ఎప్పుడూ నిజమే మాట్లడడం ఎలా సాధ్యం? ఇవన్నీ ప్రత్యక్షంగా ఆచరించి చూపేందుకే.తనయుడిగా, భర్తగా, సోదరుడిగా, తండ్రిగా, ఉత్తమ స్నేహితుడిగా , మంచి పాలకుడిగా ఎలా ఉండాలో పాటించి చూపించాడు. అలాంటి రాముడి శ్లోకాన్ని మూడు సంధ్యలలో చదువుకుంటే మనస్సు శుద్ధి జరగడంతో పాటూ ఇబ్బందులు తొలగిపోతాయి. 

ధ్యానం
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

Also Read: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!

శ్రీరామ కర్ణామృతం నుంచి సేకరించిన శ్లోకాలి

ప్రాతఃకాల ధ్యానం

ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం
బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్,
దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్.

అర్థం: దేవతలకు అధిపతి , సూర్యవంశశ్రేష్ఠుడు , లోకాలనూ ఆనందింపజేసేవాడు, బాలుడు, ఉదయభానుడి లేత కిరణాల్లాంటి నేత్రాలు కలిగినవాడు, మనసులో పూజలందుకునేవాడు, సంసార బాధలు తొలగించేవాడు, ఆభరణాలతో ప్రకాశించేవాడు, కౌసల్య తనయుడు,  చిరునువ్వుతో వెలిగే రాముడిని ప్రాతఃకాలంలో ధ్యానం చేస్తున్నాను.

Also Read: Sri Rama Navami Date 2024: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!

మధ్యాహ్నం చదవాల్సిన శ్లోకం

మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం
మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్,
సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం
వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్.

అర్థం:మాణిక్యసమూహంతో సుందరుడు, చూపులతోనే నవ్వులు చిందించేవాడు, చాలా మంది సూర్యుల కాంతి కలిగినవాడు, మరకత మణుల ప్రోగులాంటి ఆకారం కలవాడు, ఆనందస్వరూపుడు, పచ్చని వస్త్రం ధరించేవాడు, ఎడమ తొడపై సీతను కూర్చోబెట్టుకున్నవాడు, అన్నిలోకాలకు నివాస స్థానమైనవాడు , శ్రైష్ఠమైన దనుర్భాణాలు ధరించేవాడు, నా మనసులో ప్రకాశించే ళ్రీరామ చంద్రుడికి మధ్యాహ్నం నమస్కరిస్తున్నాను.

Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!

సాయంత్రం చదవాల్సిన శ్లోకం

ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారం
శ్యామం శాంతం సురేంద్రం సురమునివినతం కోటిసూర్యప్రకాశమ్,
సీతసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.

అర్థం: చంద్రుడిలా ప్రకాశించేవాడు, సంసార బాధ్యతలు అంతం చేసేవాడు, నల్లనివాడు, దేవతలతో పూజలందుకునేవాడు, కోటి సూర్యుల కాంతిని తనలో నింపుకున్నవాడు,  సీతాలక్ష్మణులు సేవిస్తున్నవాడు, దేవతలకు - మనుషులకు సులభుడైనవాడు , గొప్పసింహాసనంపై ఉన్నవాడు , నవ్వుతో సుందరమైన మోముగల రామచంద్రుడిని సాయంకాలం ధ్యానిస్తున్నాను.

ఏ సమయంలో అయినా చదువుకునే శ్లోకం
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. 
లోకాభిరామం శ్రీరామం  భూయో భూయో నమామ్యహం

ఆపదలను పోగొట్టేవాడు, అన్ని సంపదలను ఇచ్చేవాడు, లోకంలో అతి సుందరమైనవాడైన శ్రీరామ చంద్రుడికి నమస్కారం...

దశావతారాల్లో ఏడవ అవతారంగా  శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజు  పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించాడు. ఏటా ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.

శ్రీ రఘురామ, చారు తులసీ దళధామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ; జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.

మంగళకరమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి తులసి మాలలు ధరించిన,శమ క్షమాది శృంగార గుణములు తాల్చి... రాక్షసుల సంహరించి లోకాలను కాపాడిన రామా...నీకు మంగళం, మా పాపాలు హరింపజేయి..

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pahalgam Terrorist Attack: పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pahalgam Terrorist Attack: పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
Latest OTT Releases: కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Embed widget