By: Arun Kumar Veera | Updated at : 01 Mar 2025 11:03 AM (IST)
మీ టైమ్ వేస్ట్ కాకూడదు అనుకుంటే ఈ లిస్ట్ చూడండి ( Image Source : Other )
Bank Holiday In March 2025: 2025 మార్చి నెల ప్రారంభమైంది. ఈ నెలలో హోలీ, ఉగాది, రంజాన్ వంటి కీలక పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. మార్చి నెలలోని 31 రోజుల్లో, 14 రోజులు బ్యాంక్‌లు సెలవులో ఉంటాయి. అంటే, ఈ నెలలో దాదాపు సగం రోజులు బ్యాంక్‌లు పని చేయవు. మన దేశంలో, బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2025 మార్చి నెల కోసం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. RBI హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం, మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మొత్తం 14 రోజులు మూతబడతాయి.
మార్చి నెల హాలిడేస్ లిస్ట్‌లో.. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండో & నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు కలిసి ఉన్నాయి. బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి సెలవులు మారతాయి. ప్రాంతీయ పండుగల సమయంలో, కేవలం ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పని చేయవు, మిగిలిన చోట్ల 'వర్కింగ్ డే'లో ఉంటాయి.
మార్చి 14న హోలీ, మార్చి 31న రంజాన్ వంటి ప్రధాన పండుగల సమయంలో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు హాలిడే తీసుకుంటాయి.
తెలుగు నూతన సంవత్సరం ప్రారంభ పండుగ 'ఉగాది', మార్చి 30న వచ్చింది. ఆ రోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవులో కలిసిపోయింది.
తేదీ & రాష్ట్రం వారీగా మార్చి 2025లో బ్యాంక్ సెలవుల జాబితా:
మార్చి 02 (ఆదివారం) - వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 07 (శుక్రవారం): చాప్చర్ కుట్ --- మిజోరంలో బ్యాంకులు హాలిడే తీసుకుంటాయి, మిగిలిన రాష్ట్రాల్లో ఇది 'వర్కింగ్ డే'
మార్చి 08 (రెండో శనివారం) - వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 09 (ఆదివారం) - వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 13 (గురువారం): హోలికా దహన్ & అట్టుకల్ పొంగల్ --- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళలో బ్యాంకులకు హాలిడే
మార్చి 14 (శుక్రవారం): హోలీ (ధులేటి/ధులంది/ధోల్ జాతర) --- త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు
మార్చి 15 (శనివారం): కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో హోలీ సెలవు
మార్చి 16 (ఆదివారం) - వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 22 (నాలుగో శనివారం): వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు మరియు బీహార్ దివాస్
మార్చి 23 (ఆదివారం) - వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 27 (గురువారం): షబ్-ఎ-ఖాదర్ --- జమ్ములో బ్యాంకులు మూతబడతాయి
మార్చి 28 (శుక్రవారం): జుమాత్-ఉల్-విదా --- జమ్ము&కశ్మీర్‌లో బ్యాంకులు సెలవులో ఉంటాయి
మార్చి 30 (ఆదివారం) - వారాంతపు సెలవు, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 31 (సోమవారం): రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1)/ఖుతుబ్-ఎ-రంజాన్ --- మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ మినహా చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు సెలవు
బ్యాంకు సెలవుల జాబితాను RBI ప్రతి నెలా తయారు చేస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అనే మూడు వర్గాల కింద ఈ సెలవులు డిక్లేర్ అవుతాయి.
మరో ఆసక్తికర కథనం: పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్ సిలిండర్ రేట్లు
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం