అన్వేషించండి

Raksha Bandhan 2024: రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందే - రక్షాబంధన్ వేడుకలకు వీళ్లంతా దూరం!

The Unseen Side of Raksha Bandhan: ఆగష్టు 19 సోమవారం రక్షాబంధన్. సోదర - సోదరి బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకకు కొందరు దూరం..దానివెనుక కారణాలెన్నో..

Raksha Bandhan 2024 : శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగల్లో  రక్షా బంధన్ ఒకటి. సోదరుడు - సోదరి బంధానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటారు. యుగయుగాలుగా ఆచరిస్తున్న ఈ పండుగ హిందువులకు చాలా ప్రత్యేకం. ఆ రోజు తమ సోదరుల చేతికి రాఖీ కట్టాల్సిందే అని సోదరీమణులు భావిస్తే..ఎంతదూరం అయినా వెళ్లి సోదరితో రాఖీ కట్టించుకోవాలని సోదరుడు అనుకుంటారు. వెళ్లే అవకాశం లేనివారు రాఖీని పంపించే ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంత ఘనమైన ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో అస్సలు జరుపుకోరు. మరికొందరు సోదరులకు కాకుండా కర్రలకు రాఖీలు కడుతుంటారు...వీని వెనుక ప్రచారంలో ఉన్న కథలెన్నో...

Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!
 
రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందే!

ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా  బైనిపూర్ చాక్ లో రక్షాబంధన్ వేడుక అస్సలు జరుపుకోరు. ఎప్పుడూ జరుపుకోలేదా..కొత్తగా మానేశారా అంటే.. మూడు దశాబ్ధాల క్రితం రాఖీపండుగ జరుపుకున్నారట కానీ ఆ తర్వాత వద్దుబాబోయ్ అని వదిలేశారట. దీనివెనుక ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే.. ఆ  గ్రామంలో ఉండే ఓ జమిందార్ కి కుమారులున్నారు...ఓ రాఖీ పండుగ రోజు ఓ పేదింటి అమ్మాయిలను తీసుకొచ్చి రాఖీ కట్టించుకున్న జమిందార్ పిల్లలు ఏం కావాలో కోరుకోమన్నారట. వాళ్లు ఏకంగా..ఆస్తి కావాలని అడిగారట. మాటతప్పని జమిందార్ ఆస్తి మొత్తం రాసిచ్చేసి రోడ్డున పడ్డాడు....ఆ తర్వాత పూర్తిగా ఆ ఊరికే దూరమైపోయారట. అప్పటి నుంచి రాఖీ కట్టించుకునే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేశారట బైనిపూర్ గ్రామస్తులు..
 
ప్రాణాలు తీసిన రక్షా బంధన్  

ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా గున్నార్ లోనూ ఈ వేడుక జరుపుకోరు. రెండు దశాబ్ధాల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది..ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ యువకుడు చనిపోయాడు. రాఖీ వల్లే ఇదంతా జరిగిందనే భావనలో..అప్పటి నుంచి ఈ వేడుక జరుపుకోవడం మానేశారు.  ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేసిన కొందరు ఆ తర్వాత కూడా రాఖీ పండుగ జరుపుకున్నారట. అప్పుడు కూడా వివిధ రకాల ప్రమాదాల్లో కొందరు మృత్యువాతపడ్డారు. అందుకే ఆ గ్రామంలో రాఖీ పండుగ అంటే శాపంగా భావిస్తారు. గున్నార్ మాత్రమే కాదు..గోండా జిల్లాలోని బికంపూర్ జగత్ పూర్వా అనే గ్రామం సహా యూపీలో చాలా గ్రామాల్లో రక్షాబంధన్ ఉండదు.. 

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

కర్రలకు రాఖీ 

యూపీలో హార్పూర్ జిల్లా లో దాదాపు 60 గ్రామాల ప్రజలు కర్రలకు రాఖీలు కడతారు.  17వ తరానికి చెందిన రాజు మహారాణా ప్రతాప్ కాలంలో ఈ సంప్రదాయం పాటించేవారట..అందుకే గ్రామస్తులు అదే అనుసరిస్తున్నారు. అప్పట్లో యుద్ధంలో పాల్గొనే సైనికులకు రాఖీ కట్టేవారట.. కానీ ఆ తర్వాత వారి ఆయుధాలకు రక్ష కట్టడం ప్రారంభించారట. అందికే సైనకులకు గుర్తుగా కర్రలకు రాఖీ కడుతుంటారు ఈ గ్రామస్తులు. 

రక్షా బంధన్ వీరికి శాపం

యూపీ మీరట్ లో సురానా అనే గ్రామంలో కూడా రాఖీ పండుగ జరుపుకోరు.  12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజునే మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై  దండెత్తి అందర్నీ చంపేశాడు. కేవలం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మాత్రమే బతికారు. ఆ రోజు వాళ్ల చేతికి రాఖీ లేదు.. ఆ తర్వాత రాఖీ పండుగకు ఆ ఇద్దరు పిల్లలో ఒకరు రాఖీ కట్టించుకుంటే..ఆ తర్వాత దివ్యాంగుడు అయిపోయాడట. అప్పటి నుంచి రాఖీ తమకు కలసిరాదు అనేది గ్రామస్తుల నమ్మకం. అందుకే అక్క రక్షాబంధన్ వేడుక జరుపుకోరు.  

గమనిక:  సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget