చాణక్య నీతి: బంధం తెగిపోవడానికి కారణాలివే



ఆచార్య చాణక్య తన విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు



గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి..చంద్రగుప్త మౌర్యుడికి పట్టం కట్టాడు



చాణక్యుడికి రాజకీయాల గురించి మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం మరియు అంతర్దృష్టి ఉంది.



తన నీతిశాస్త్రంలో భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ప్రస్తావించిన చాణక్యుడు వైవాహిక జీవితాన్ని తరచుగా నాశనం చేసే విషయాలను వివరించారు



భార్యాభర్ల మధ్య చెడు విషయాలను స్లో పాయిజన్ గా వర్ణించాడు, ఇది చివరికి సంబంధాన్ని నాశనం చేస్తుందన్న చాణక్యుడు ఇద్దరూ ఎలా ఉండకూడదో చెప్పాడు



భార్యాభర్తల సంబంధాన్ని బలహీనపరచడానికి అతి పెద్ద కారణం అహం. చాణక్య విధానం ప్రకారం భార్యాభర్తలిద్దరికీ ఈ సంబంధంలో సమాన హక్కులుంటాయి. ఇలాంటి పరిస్థితిలో అహానికి స్థానం లేదు. ఏ ఒక్కరికి అహం ఉన్నా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది



భార్యాభర్తల మధ్య ఎలాంటి సందేహానికి చోటుండకూడదు. సందేహం లేదా అపార్థం ఎంతటి బంధాన్ని అయినా బీటలు వారుస్తుంది.



అబద్ధాల కోటలపై కట్టిన బంధం ఎంతోకాలం నిలబడదు. అబద్ధం చెప్పి అప్పటికప్పుడు తప్పించుకున్నా ఆ తర్వాత దాని పర్యవసానాలు అనుభవించక తప్పదు



భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి. ఇద్దరూ పరస్పరం గౌరవించుకోకుంటే నిత్యం వివాదాలతో, ఆధిపత్య పోరుతో ఆ బంధం సాగుతుంది



భార్యాభర్తల బంధంలో గౌరవం లేకపోవడం వల్ల ఆ బంధం విచ్ఛిన్నమయ్యే అంచుకు వస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. ఒకర్నొకరు గౌరవించుకోవాలి, ఒకరి భావాలు మరొకరు పరిగణలోకి తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు


Thanks for Reading. UP NEXT

దీపావళికి చీపురు ఎందుకు కొనాలి!

View next story