దీపావళికి చీపురు ఎందుకు కొనాలి!



ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళిని నిర్వహించుకుంటారు. ఈ రోజున లక్ష్మీపూజ చేస్తే సిరిసంపదలు కలిసొస్తాయని నమ్మకం.



దీపావళి రోజు కొత్త చీపురు కొనడం. దీపావళికి కొత్త చీపురు కొంటే ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటామని విశ్వాసం.



సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. అందుకే దీపావళి రోజున చీపురు కొంటారు.



కొత్త చీపురు కొని ఇంటికి తీసుకొచ్చామంటే సాక్షాత్తూ లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకొచ్చినట్టేనని భావిస్తారు.



ఇంటికి తీసుకొచ్చిన కొత్త చీపురుకు పూజ చేసి ఆ తర్వాత రోజునుంచి ఉపయోగించడం మొదలుపెడతారు.



దీపావళి మాత్రమే కాకుండా ఏ రోజైనా చీపురు కొనుక్కోవచ్చు కానీ శనివారం కొనకూడదని చెబుతారు.



ఇక బహిరంగ ప్రదేశంలో చీపురు ఉంచడం అశుభం అని, ఇంటి ప్రధాన ద్వారం నుంచి చీపురును ఎవరూ చూడకూడకుండా పెట్టాలంటారు పెద్దలు.



పూజ గదిలో, పడక గదిలో చీపురు ఎప్పుడూ ఉంచకూడదు. పడక గదిలో చీపురు ఉంచినట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి



చీరుపును పాదాలతో తాకడం,దాంతో ఎవరినైనా కొట్టడం, నిర్లక్ష్యంగా విసిరి కొట్టడం అస్సలు చేయకూడదు



చీపురును దీపావళి పండుగ రోజు కొని తెచ్చుకుంటే సిరిసంపదలు పెరుగుతాయంటారు కాబట్టి కొత్త చీపురు కొని తెచ్చుకోండి



దీపావళి రోజున లక్ష్మి శాశ్వతంగా నివసించే చీపురును ఆలయంలో శుభ ముహూర్తంలో దానం చేసినా మంచిదే అంటారు
Image Credit: pinterest