దీపావళికి లక్ష్మీ పూజ చేసేవారు ఫాలో అవ్వాల్సిన 10 విషయాలు
బంగారం లేదా వెండి లేదా లోహంతో చేసిన పాదముద్రలను దీపావళి రోజున లక్ష్మీదేవి ఆరాధనలో ఉంచాలి. బంగారం, వెండితో చేసిన పాదముద్రలను ఉంచలేనివారు కాగితంపై చేసిన మెట్ల గుర్తును పూజించాలి.
శంఖం లేకుండా లక్ష్మీదేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటూ దక్షిణాభిముఖ శంఖాన్ని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
శ్రీ యంత్రాన్ని పూజిస్తే అప్పుల బాధలు తీరి సిరిసింపదలకు లోటుండదని చెబుతారు
దీపావళి రోజు లక్ష్మీదేవివి ప్రత్యేకంగా స్వీట్ నైవేద్యంగా సమర్పించి సకల శుభాలు ప్రసాదించమని వేడుకుంటారు
పరిశుభ్రత ఎక్కువగా ఉండే ఇళ్ళలో లక్ష్మీదేవి ఉంటుంది..అందుకే అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్దం మామిడి తోరణాలు, పూలదండలు కట్టి ఉంచాలి
పసుపు శుభానికి, కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం..అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చించాలి
హిందూమతంలో తమలపాకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి, గణేషుడి ఆరాధనలో భాగంగా తమలపాకుపై స్వస్తిక్ గుర్తు వేస్తారు
లక్ష్మీదేవి సేవలో ఉంటుంది ఏనుగు. అందుకే లక్ష్మీదేవిని గజలక్ష్మి అని కూడా అంటారు. ఏనుగుకు చెరకుగడలు ఇష్టం కాబట్టి లక్ష్మీపూజలో ఇవి కూడా చేరుస్తారు. మన్మధుడి నుంచి అమ్మవారు తీసుకున్న విల్లుతో సమానంగా చెరుకుగడను భావిస్తారు.
చాలా మంది కొత్తిమీర గింజలను కొని వాటిని ఇంట్లోనే ఉంచుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు పూజలో ఉంచి ఆ తర్వాత బీరువాలో భద్రపరుస్తారు..ఇది అదృష్, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు.
లక్ష్మీదేవి ఎప్పుడూ తామరపువ్వుపై కూర్చుని ఉంటుంది. ఆమె ఆసనం అయిన తామరపూలతో లక్ష్మీఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. Image Credit: pinterest