నరక చతుర్దశి, దీపావళి రెండూ ఒకేరోజు - ముహూర్తం వివరాలు
దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది.
దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి.
అక్టోబరు 24 సోమవారం సాయంత్రం 4.49 వరకూ చతుర్థశి ఉంది.. అంటే దాదాపు 5 గంటల నుంచి అమావాస్య మొదలవుతోంది...
అక్టోబరు 25 మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకు అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే సూర్యాస్తమయానికి అమావాస్య ఉండదు
ఐదు రోజుల దీపావళి పండుగలో రెండో రోజు నరకచతుర్థశి జపుకుంటారు. ధన త్రయోదశి మొదటి రోజు కాగా రెండో రోజు నరకచతుర్థశి మూడో రోజు దీపావళి అన్నమాట.
ధంతేరాస్ తర్వాత వచ్చే ఈ పండుగను రూప్ చౌదాస్ లేదా కాళీ చౌదాస్ అని కూడా పిలుస్తారు. మూడో రోజు దీపావళి, నాలుగో రోజు గోవర్థన్ పూజ, ఐదో రోజు భాయీ దూజ్ జరుపుకుంటారు.
అక్టోబరు 24 సోమవారం సూర్యోదయానికి చతుర్థశి ఉండడంతో నరకచతుర్థశి...ఆ రోజు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య రావడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటారు.
అక్టోబరు 24 సోమవారమే నరక చతుర్థశి, దీపావళి
నరకచతుర్థశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం మంచిది. ఈ రోజు ఇలా చేయడం వల్ల అజ్ఞానం నశించి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయని విశ్వసిస్తారు.