దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!



తిథులు తగులు మిగులు వచ్చిన ప్రతీసారీ ఏరోజు పండుగ చేసుకోవాలో అనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఈసారి దీపావళి విషయంలో అదే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ దీపావళి 24న 25న ఎప్పుడంటే...



దీపావళి వేడుకలు జరుపుకోవడంపై కొంత అయోమయం నెలకొంది. ఈ నెల 25 సాయంత్రం సూర్య గ్రహణం ఏర్పడుతోంది. అయితే 25 మంగళవారం సూర్యోదయం సమయానికి అమావాస్య ఉంది.



సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఘడిలు పూర్తై పాడ్యమి ఘడియలు మొదలవుతాయి.



దీపావళి అమావాస్య అయినప్పుడు అమావాస్య లేకుండా పండుగ ఎలా చేస్తామని కొందరి వాదన అయితే... సర్యోదయానికి తిథి లెక్కకాబట్టి ఎందుకు చేసుకోరాదన్నది మరికొందరి వాదన.



ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది.



దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి.



అక్టోబరు 24 సోమవారం సాయంత్రం 4.49 వరకూ చతుర్థశి ఉంది.. అంటే దాదాపు 5 గంటల నుంచి అమావాస్య మొదలవుతోంది...



అక్టోబరు 25 మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకు అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే సూర్యాస్తమయానికి అమావాస్య ఉండదు



అందుకే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి.



Images Credit: Pixabay