ఇలాంటి భోజనం చేయకూడదు!



‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు, సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు, ఆహారాన్ని సక్రమంగా తీసుకోని వానికి ఏ కోరికలు ఉండవు' -భగవద్గీత



పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు. ఈ నియమాల్లో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కూడా సూచించారు పండితులు



కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనం చేయకూడదు



పాలన్నం తిన్నాక పెరుగు అన్నం తినకూడదు



కాళ్ళు చాపుకుని, చెప్పులు వేసుకుని భోజనం చేయరాదు



గ్రహణం రోజున అంటే సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు, చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు



దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు తీసుకోరాదు



భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటం చేయరాదు



అన్నాన్ని వృధా చేయకూడదు..మీ ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టకూడదు



అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది
Images Credit: Pinterest