పెళ్లైన స్త్రీలు పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు!
ఉత్తర భారతదేశంలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది కానీ దక్షిణ భారతదేశంలో కొందరు మాత్రమే పాటిస్తారు
ఓ స్త్రీకి వివాహం అయిందనేందుకు గుర్తుగా ఉత్తరాది మహిళలు సింధూరం పెట్టుకుంటే... దక్షిణాది మహిళలు తాళిబొట్టు ధరిస్తారు
ఉత్తరభారతదేశంలో తాళిబొట్టున్నా పెళ్లైంది అనేందుకు గుర్తుగా పాపిట్లో సింధూరాన్ని పెడతారు
వివాహం జరుగుతున్నప్పడే మెళ్లో తాళికట్టిన వెంటనే పాపిట్లో సింధూరం పెడతాడు వరుడు
దక్షిణాదిన వివాహక్రతువులో పాపిట్లో కుంకుమ సంప్రదాయం లేదు కానీ... వారిని చూసి ఫాలో అవడ అనుకోవచ్చు లేదంటే ఫ్యాషన్ కారణంగా కొందరు పాపిట్లో సింధూరం పెడుతున్నారు
సనాతన ధర్మానికి కట్టుబడినవారంతా నుదుటి మధ్య ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టుపెట్టుకోవడం చేస్తారు. ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే భేదం లేదు. కానీ వివాహితులు మాత్రమే పాపిట్లో సింధూరం ధరిస్తారు.
తన పంచప్రాణాలు నువ్వు చెబుతూ వరుడు వధువు పాపిట్లో సింధూరం దిద్దుతాడని చెబుతారు
వాస్తవానికి నుదుటిన ఆ ప్రాంతాన్ని కప్పిఉంచడం చాలా మంచిదంటారు పండితులు. పాపిట బిళ్ల పెట్టుకోవడం వెనుకున్న ఆంతర్యం కూడా అదేనంటారు.