చాణక్య నీతి: ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకండి



సాయం చేయాలనుకోవడం మంచిదే కానీ అది ఎవరికి అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరం లేనివారికి చేసే సాయం నిరర్థకమే.



సాయపడే గుణం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలన్న చాణక్యుడు..ఆ సాయం ఎలాంటి వారికి చేయాలి ఎవరికి చేయొద్దో కూడా చెప్పాలని తన నీతిశాస్త్రంలో చెప్పాడు



చాణక్యుడు సాయం చేయొద్దని చెప్పిన ముగ్గురు
1. చెడుస్వభావం ఉన్నవారికి
2. ఎప్పుడూ ఏడ్చేవారికి
3. తెలివితక్కువ వారికి



చెడు స్వభావం ఉన్న స్త్రీకి, వ్యసనం ఉన్న పురుషుడికి ఎట్టిపరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. అలాంటి వారు వారికి అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వినియోగించుకుని ఆ తర్వాత నిండాముంచేస్తారు



ఎప్పుడూ ఏడ్చేవారికి సాయం చేయకూడదు. ఎందుకంటే నిత్యం బాధపడేవాళ్లకి ఎదుటివారి బాధ పట్టదు. ఇలాంటి వారికి సాయం చేసినా నిరర్థకమే అవుతుంది. ఇతరుల విజయాన్ని వీళ్లు ఎంజాయ్ చేయలేరు. అసూయ కూడా ఎక్కువే ఉంటుంది.



తెలివితక్కువ వారు సహాయాన్ని కూడా సమర్థవంతంగా తీసుకోలేరు. వాటిలో కూడా మంచి కన్నా చెడే వెతుక్కుంటారు.



చాణక్యుడు చెప్పినట్టు సాయం చేయాలి కానీ ఎదుటివారికి అది అందుకునే అర్హత ఉందో లేదో చూసుకోవాలంటాడు. లేదంటే ఆ సాయం బూడిదలో పోసిన పన్నీరుగానే మారిపోతుందని నీతిశాస్త్రంలో బోధించాడు చాణక్యుడు



ఎన్ని జనరేషన్లు మారినా ఆచార్య చాణక్యుడి విధానాలు జీవితంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి