చాణక్య నీతి: భర్త ఇలా ఉంటే ఆ భార్య అదృష్టవంతురాలు



ఆచార్య చాణక్యడు గొప్ప తత్వవేత్త, సలహాదారుడు. తన నీతిశాస్త్రం ద్వారా చాలా విషయాలు బోధించాడు



ఇందులో భాగంగా మానవ జీవితానికి సంబంధించిన చాలా విషయాలను వివరించాడు.



చాణక్యుడి ప్రకారం... నైతికతలో వ్యక్తి జీవితం, స్నేహం, కర్తవ్యం, స్వభావం, భార్య, పిల్లలు, సంపద, వ్యాపారం సహా అన్ని విషయాల గురించి పేర్కొన్నాడు. ఇందులో భాగంగా...



పురుషులు కొన్ని లక్షణాలు అలవర్చుకుంటే ఉత్తమ భర్తగా భార్య మనసులో స్థానం సంపాదించుకోగలుగుతారని చాణక్యుడు చెప్పాడు



1.విశ్వసనీయత
చాణక్య విధానం ప్రకారం మనిషి ఎల్లప్పుడూ సంబంధాలకు విశ్వసనీయంగా ఉండాలి. తన భార్య పట్ల నిజాయితీగా ఉండే వ్యక్తి ఎప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు.



2.గౌరవప్రదమైన ప్రవర్తన
భార్యకు గౌరవం ఇచ్చే పురుషుడు ఎప్పటికీ ఆమె దృష్టిలో ఉత్తమ భర్తగా నిలిచిపోతాడు.



3. సమయం కేటాయించడం
ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలి, తద్వారా కుటుంబంలో ప్రతి ఒక్కరి కోర్కెలు తీర్చగలుగుతారు. కానీ నిత్యం డబ్బే ధ్యేయంగా అస్సలు పరిగెత్తకూడదు.



కుటుంబానికి సమయం ఇవ్వకుండా..భార్య పిల్లలతో సంతోషం సమయం గడపని భర్త ఎంత సంపాదించినా అసలైన ప్రేమను ఇవ్వలేడు, పొందలేడు



ఎన్ని జనరేషన్లు మారినా ఆచార్య చాణక్యుడి విధానాలు జీవితంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి