Happy Diwali 2024 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
Diwali 2024 Special Wishes in Telugu : సిరిసంపదలను ప్రసాదించే దీపావళి రోజు మీ బంధుమిత్రులకు,స్నేహితులకు, సన్నిహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...

Diwali Wishes In Telugu: భూదేవి-వరహా స్వామికి అసుర సంధ్యలో జన్మించిన నరకాసురుడు..తల్లి చేతిలో మాత్రమే మరణించాలనే వరం కోరుకున్నాడు. ఆ గర్వంతో మూడు లోకాలను ముప్పతిప్పలు పెడతాడు. దేవతలంతా శ్రీ మహా విష్ణువుకి మొరపెట్టుకుంటారు. శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడిగా, భూదేవి సత్యభామగా జన్మించి నరకాసుర సంహారం చేస్తారు. ఆరోజే నరక చతుర్థశి...ఆ ఆనందంలో ఆ మర్నాడు దీపావళి పండుగ జరుపుకున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణసంహారం తర్వాత అయోధ్యకు వచ్చిన సందర్భంగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. అలా దీపావళిని యుగయుగాలుగా జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులుకు ఈ శ్లోకాలతో , కొటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి...
Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి - పూజా విధానం ఇదిగో ఫాలోఅయిపోండి!
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఓం మహాదేవ్యేచ విద్మహే
విష్ణు పత్నేచ దీమహే...
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే ||
దీపావళి శుభాకాంక్షలు
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
పరిష్కృత స్థాపిత రత్నదీపే జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీమ్ |
నమామ్యహం మత్కులవృద్ధిదాత్రీం సౌదాది సర్వాంగణ శోభమానామ్ ||
దీపావళి శుభాకాంక్షలు
భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః |
ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖమ్ |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభమ్ ||
దీపావళి శుభాకాంక్షలు
దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే
దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ |
స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం
స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః ||
దీపావళి శుభాకాంక్షలు
శుభం భవతు కళ్యాణీ ఆయురారోగ్యసంపదామ్ |
మమ శత్రువినాశాయ దీపలక్ష్మి నమోఽస్తు తే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం దీపావళి వేళ మీ ఇంట వెల్లివిరియాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్టు..
మీ జీవితంలో ఒక్కోమార్పుని ఆహ్వానిస్తూ కొత్త జీవీతానికి ఆహ్వానం పలకండి
దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలు అందించాలి
Happy Diwali 2024
దీపాల వెలుగులా మీ ప్రేమ వ్యాప్తి చెందాలి
తొలగిపోయే చీకటిలా ద్వేషం నశించిపోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీకు అంతులేని ఆనందాన్ని , ప్రేమను అందించాలని ABP దేశం కోరుకుంటోంది.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

