అన్వేషించండి

Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం

Telangana: చంద్రబాబు ప్రభుత్వం గోదావరి నీళ్లు తీసుకెళ్తూంటే కనీసం అడగడం లేదని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ నీటి వాటాలను కాపాడటం లేదన్నారు.

Harish Rao criticizes Revanth Reddy on Chandrababu banakacharla project:    తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న‌దే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం అయినా  కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాగునీటి విష‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని బీఆర్ఎస్ ఆరోపించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  గోదావ‌రి నీళ్ల‌ను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోందని..  తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు బ‌న‌క‌చ‌ర్ల ఆపాల‌ని ఏపీకి క‌నీసం లేఖ కూడా రాయ‌లేదన్నారు. 

రాజెక్టుల‌కు అనుమ‌తుల సాధ‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లమైందని.. బ‌న‌క‌చ‌ర్ల‌కు నిధుల కోసం చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ‌లు రాశారని హరీష్ రావు గుర్తు చేశారు. . చంద్ర‌బాబు లేఖ‌పై కేంద్రంలో  ఫైళ్లు కదులుతున్నాయన్నారు. చంద్ర‌బాబు న‌వంబ‌ర్‌లో లేఖ రాస్తే సీఎం రేవంత్ ఏం చేశారు..? బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుందని వెంటనే ఆపే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.  

కృష్ణా జ‌లాల విష‌యంలో సెక్ష‌న్ 3ని సాధించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని హ‌రీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు సెక్ష‌న్ 3పై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్తే క‌నీసం కేవియ‌ట్ వేయ‌రా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్ర‌భుత్వాన్ని అధికారులు స‌రిగ్గా మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేయ‌ట్లేదు. మంచి అడ్వ‌కేట్ల‌ను పెట్టి సెక్ష‌న్ 3 విష‌యంలో వాదించాలి క‌దా అని ప్రశ్నించారు. సాగునీటి మంత్రిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విఫ‌ల‌మ‌య్యారు. మేడిగ‌డ్డ‌ను పండ‌బెట్టారు.. పాల‌మూరును ప‌క్క‌కు పెట్టారు. ఇప్ప‌టికైనా న‌దీ జ‌లాలపై రాష్ట్ర ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలని సలహా ఇచ్చారు. 

నీటి సమస్యలపై అఖిల‌ప‌క్షం వేస్తే స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యానాథ్‌ను స‌ల‌హాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్య‌నాథ్ విష‌యంలో రేవంత్ గురుద‌క్షిణ చెల్లించారేమోనని హరీష్ మండిపడ్డారు. తుంగ‌భ‌ద్ర‌ను గండికొట్టేందుకు ఏపీ, క‌ర్ణాట‌క య‌త్నాలు చేస్తున్నాయి. ఏపీ, క‌ర్ణాట‌క తుంగ‌భ‌ద్ర‌కు గండి కొడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు..? 2017లో ఏపీ ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తే గ‌ట్టిగా అడ్డుకున్నాం అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పెన్నా నదుల నుండి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళతాం అంటే కేసీఆర్ గారు గొడవ పడి, నిరసన తెలియజేస్తే నీళ్లు తీసుకెళ్ల లేదని హరీష్ రావు గుర్తుచేశారు. 

సముద్రంలోకి వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా పోతోందని వాటిని మళ్లించి రాయలసీమలోని బకనచర్లకు మళ్లించే ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల కోసం కేంద్రం వద్ద గట్టి ప్ర.యత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఎనభై వేల కోట్లు అవసరమయ్యే ఈ ప్రాజెక్టు చేపడితే..  తెలంగాణకు నష్టమని హరీష్ రావు వాదిస్తున్నారు. ఇటీవల ఓ సమావేశంలో ఈ ప్రాజెక్టు అంశంపై సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వానికి వెంటనే లేఖలు రాయాలని రేవంత్ ఆదేశించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
KV Admission 2026: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
Dhurandhar 2 Collections : ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
Embed widget