అన్వేషించండి
Kohli 100 Test Match: అనుష్క బుగ్గలను ముద్దాడి - 100 టెస్టు గిఫ్ట్ అందుకొని మురిసిన కోహ్లీ

virat-kohli-100th-test-match
1/5

వంద టెస్టుల ఘనత అందుకున్న విరాట్ కోహ్లీకి (Virat Kohli) టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అరుదైన బహుమతి అందించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన అతడి వందో టెస్టు మ్యాచు క్యాప్‌ను (100th test match cap) బహూకరించాడు.
2/5

ఈ గొప్ప సందర్భంలో అనుష్క శర్మ సైతం కోహ్లీ పక్కనే నిలబడి మురిసిపోయింది. బహుమతి అందుకున్నాక ఆమెను ముద్దాడి విరాట్ మురిసిపోయాడు.
3/5

మొత్తంగా వందో టెస్టు ఆడుతున్న 12వ భారతీయుడిగా విరాట్ నిలిచాడు. భారత్, శ్రీలంక మొహాలి వేదికగా తొలి టెస్టులో (IND vs SL frist test) తలపడుతున్నాయి. ఇది కోహ్లీ కెరీర్లో వందో టెస్టు మ్యాచ్. ఈ సందర్భంగా విరాట్‌ను టీమ్‌ఇండియా క్రికెటర్లు, యాజమాన్యం, బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది.
4/5

'ఇదో ప్రత్యేక సందర్భం. నా కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు. బీసీసీఐకి (BCCI) నా ధన్యవాదాలు. చిన్నప్పుడు నేను హీరోగా భావించే వ్యక్తి నుంచి వందో టెస్టు మ్యాచు టోపీ అందుకోవడం నిజంగా అద్భుతం' అని రాహుల్ ద్రవిడ్ నుంచి క్యాప్ అందుకున్నాక కోహ్లీ అన్నాడు.
5/5

ఎక్కువ మంది టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్న వేళ విరాట్ వందో టెస్టు ఆడుతుండటం ప్రత్యేకం. ఈ సమయంలో జట్టు సభ్యులంతా అతడి వెనకే నిలబడి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. (All images credit : BCCI)
Published at : 04 Mar 2022 11:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion