Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABP
మనందరం చూశాం కదా…..ప్రధాని మోదీనే నేరుగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఖతార్ అమీర్ ను సాదరంగా భారత్ కు ఆహ్వానిస్తున్న దృశ్యం ఇది. ట్రంప్ లాంటి వ్యక్తే మన మోదీకి చెయిర్ వేసి చెయిర్ తీస్తున్న దృశ్యాలను మొన్న మనం చూశాం అలాంటిది వచ్చిన అతిథి తన అధికారిక నివాసం వరకూ వచ్చే దాకా వెయిట్ చేయకుండా మోదీనే నేరుగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆహ్వానించటం అనేది చాలా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ స్థాయిలో మోదీ రిసీవ్ చేసుకోవటానికి అపర కుబేరులైన ఆ అమీర్ లు ఖతార్ తరపున భారత్ తో రెండు లక్షల కోట్ల రూపాయల వాణిజ్యానికి అంగీకరించటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశానికి మంచి జరుగుతుంది కాబట్టే మోదీనే ఆయన దగ్గరకు వెళ్లి అంత గౌరవం ఇచ్చి ఆహ్వానించారు.
అసలు ఎవరీ అమీర్ అంటే..పూర్తి పేరు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. అమీర్ అనేది వాళ్ల రూలర్ నేమ్. ఆ పేరుతోనే పాలన సాగిస్తారు. ఖతర్ దేశం ఏర్పాటైనప్పటి నుంచి ఈ అల్‌థానీ కుటుంబమే అధికారంలోకి ఉంది.
ప్రస్తుతం వీరి వంశంలోని 11 మందికి అమీర్ హోదా ఉంది.
నేచుర్ గ్యాస్, ఆయిల్ నిల్వలు విపరీతంగా ఉండటంతో ఖతర్ దేశానికే ప్రపంచ వాణిజ్యంలో తిరుగులేని స్థానం ఉంది. 2013 నుంచి ఖతర్ తమీమ్ పాలనలోనే ఉంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, అల్‌థానీ వంశానికి చెందిన ఆస్తుల మొత్తం విలువ 29 నుంచి 35లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇందులో షేక్ తమీమ్ ఆస్తి లక్షా 73వేల కోట్ల రూపాయల దాకా ఉంటుంది.
సహజవనరులే కాకుండా, విదేశాల్లో పెట్టుబడుల ద్వారా ఈ కుటుంబం ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వీళ్ల ప్రధాన ఆస్తుల్లో గోల్డెన్ ప్యాలెస్ చెప్పుకోదగినది. దోహాలో ఉండే ఈ విలాసవంతమైన రాయల్ ప్యాలెస్ విలువే దాదాపుగా లక్ష కోట్లు ఉంటుందని చెబుతారు. ఇంటీరియర్ అంతా ఫుల్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఈ భవన సముదాయంలో మొత్తం 15 కోటలు. 500 కార్లకు చోటు కల్పించే పార్కింగ్ స్థలం ఉంది.





















