అన్వేషించండి

ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు

ABP Network: ఏబీపీ నెట్ వర్క్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫిబ్రవరి 21 22 తేదీల్లో ముంబైలో జరగనుంది. 30కి పైగా సెషన్లను, 50 మందికి పైగా వక్తలతో నిర్వహించనున్నారు.

Ideas of India Summit 2025: న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వరకూ భారతదేశం ఇప్పుడు ప్రపంచ్యాప్తంగా వస్తున్న అగ్రెసివ్‌ జియోపాలిటిక్స్ మార్పులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో  భారతదేశంలోని ప్రముఖ బహుళ భాషా వార్తా నెట్‌వర్క్ అయిన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025  నాల్గవ ఎడిషన్‌ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 21 , 22, 2025 తేదీలలో ముంబైలో జరగుతుంది.

ఈ సారి ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 "మానవత్వం తదుపరి సరిహద్దు" ( Humanity’s Next Frontier” ) అనే ధీమ్‌తో సమ్మిట్ నిర్వహిస్తోంది.  ప్రపంచ అనిశ్చితుల మధ్య మానవ జ్ఞానం, ఆవిష్కరణల సరిహద్దులను నెట్టివేసే కొత్త ప్రపంచ క్రమంలో భారతదేశం పాత్రపై చర్చించడానికి ప్రముఖ మేధావులు, ఛేంజ్ మేకర్స్ పాల్గొంటారు. వీరు  సైన్స్, AI, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి లో 'మంచి కోసం శక్తి'గా ఉద్భవించడానికి భారతదేశం తన శక్తిని, మ్యాన్ పవర్ ను..  సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను ఉపయోగించుకునే మార్గాలను ఈ సమ్మిట్ అన్వేషిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ లక్ష్యం. భవిష్యత్తు కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం. అన్ని రంగాల నుంచి ప్రముఖులు, వక్తలు సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. 

ABP నెట్‌వర్క్ యొక్క ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 లో వివిధ రంగాల ప్రముఖులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు వివరిస్తారు.  మోటివేషనల్ స్పీకర్ ,లైఫ్‌స్టైల్ కోచ్ గౌర్ గోపాల్ దాస్ 21వ శతాబ్దంలో ఆధ్యాత్మిక పరిణామంలో ఉన్న నిగూఢ రహస్యాలను ఆవిష్కరిస్తారు  అలాగే  రచయిత, జర్నలిస్ట్ మరియు ట్రావెల్ రైటర్ పికో అయ్యర్  కొత్త ప్రయాణ , సాహిత్యాల్లో వస్తున్న మార్పులు, అభిరుచులపై చర్చిస్తారు.  పెర్కషన్ వాద్యకారులు, తబలా వాద్యకారులు ఉస్తాద్ తౌఫిక్ ఖురేషి , బిక్రమ్ ఘోష్ సంగీతాన్ని స్వరపరిచి, బీట్‌లను వినిపిస్తారు. సైన్స్ , టెక్నాలజీ ప్రపంచం నుండి ప్రముఖులు నోబెల్ బహుమతి గ్రహీత జీవశాస్త్రవేత్త డాక్టర్ (ప్రొఫెసర్) వెంకి రామకృష్ణన్, NIMHANS డైరెక్టర్ డాక్టర్ ప్రతిమ మూర్తి, NASA-JPL సీనియర్ సైంటిస్ట్ మరియు కాల్టెక్ విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్ చటోపాధ్యాయ, గూగుల్ డీప్‌మైండ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా తో పాటు ఇతరులు ప్రపంచం శాస్త్రీయ ఆవిష్కరణలను దాటి చేస్తున్న అద్భుత పరిశోధనలపై చర్చిస్తారు. 

ఉక్రెయిన్ చర్చలు జరిపిన మాజీ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రాయబారి కర్ట్ వోల్కర్, రచయిత, రాజకీయవేత్త, మాజీ అంతర్జాతీయ దౌత్యవేత్త డాక్టర్ శశి థరూర్, ఆర్‌పి-సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ చైర్మన్ శశ్వత్ గోయెంకా, కిర్లోస్కర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ & ఎండీ గీతాంజలి విక్రమ్ కిర్లోస్కర్, నటి , క్లైమేట్ వారియర్ భూమి పెడ్నేకర్, సంగీత స్వరకర్త , మూడు సార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్, 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆల్-ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొనే, భారత ఒలింపిక్ పతక విజేత, గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ , అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమర్ లియాండర్ పేస్, 9 సార్లు బిలియర్డ్స్/స్నూకర్ ప్రపంచ ఛాంపియన్ గీత్ సేథి, చెఫ్ , మాస్టర్ చెఫ్ ఇండియా జడ్జి రణవీర్ బ్రార్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ బెజ్వాడ విల్సన్,  జాతీయ ప్రధాన కార్యదర్శి, INC సచిన్ పైలట్ ,  ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త మరియు ఖాన్ గ్లోబల్ స్టడీస్ & ఖాన్ GS రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు మరియు పానీ ఫౌండేషన్ CEO సత్యజిత్ భట్కల్ వివిధ సెషన్లలో పాల్గొని తమ తమ రంగాల్లో వస్తున్న మార్పులు, సవాళ్లు, భారత దేశానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.
 
ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ సమ్మిట్ సాంస్కృతిక ,  సామాజిక అంశాలు, AI, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజకీయాలు , పాలన, పర్యావరణవాదం, స్థిరత్వం, వ్యాపారం , వ్యవస్థాపకత, క్రీడా సాంకేతికత, ఇన్నోవేషన్‌లలో   ఆవిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకున్న అనేక కీలక అంశాలలో భవిష్యత్ ప్రభావాలను వక్తలు చర్చిస్తారు. భారతదేశం 'మానవత్వం యొక్క తదుపరి సరిహద్దు' వైపు ప్రపంచ ప్రయాణానికి నాయకత్వం వహిస్తున్నందున.. ఆలోచనలు, సవాళ్లు, పరిష్కారాలను సమ్మిట్  చూపించడానికి ప్రయత్నిస్తుంది.  

ABP నెట్‌వర్క్ యొక్క ఐడియాస్ ఆఫ్ ఇండియా  ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు సమ్మిట్‌లు భారత్ లోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి.  విభిన్న రంగాలలోని మేధావుల ప్రత్యేక దృక్పథాలు , అనుభవాలను  దేశం ముందు ఉంచాయి. ఇటీవలి కాలంలో  ప్రపంచ సంఘటనల వల్ల ఏర్పడుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం సమ్మిట్ భారతదేశం 2047 వికసిత్ భారత్ మార్గంలో వేగవంతం కావడానికి కావాల్సిన ఆలోచనలు ఈ సమ్మిట్‌లో ఆవిష్కరిస్తారు.  వచ్చే దశాబ్దంలో ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక-ఆర్థిక ,  సాంస్కృతిక పురోగతిపై  సమ్మిట్ లో వక్తలు దృష్టి పెడతారు. గత ఎడిషన్‌ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, నాల్గవ ఎడిషన్ దేశం మరింత వేగంగా ముందుకు సాగడానికి అవసరమయ్యే ఆలోచనలు, ఐడియాలను దేశం ముందు ఉంచేందుకు సమ్మిట్ ప్రయత్నిస్తుంది.  

రెండు రోజుల పాటు జరిగే  నాల్గవ ఎడిషన్..  పాతుకుపోయిన.. భవిష్యత్ను  ప్రభావితం చేసే సమస్యలు,  పరిణామాలపై ఆలోచింప చేసే ప్రసంగాలు ఉంటాయి. 30కి పైగా సెషన్‌లు ,  50 మంది స్పీకర్లు,  సెషన్ చైర్‌లతో, ABP నెట్‌వర్క్ యొక్క ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 వీక్షకులందరికీ ఓ ఉన్నతమైన సమ్మిట్ అనుభూతిని కలిగిస్తుంది. 
 
ఈ సమ్మిట్ ఫిబ్రవరి 21-22, 2025 తేదీలలో ఉదయం 9:45 నుండి ABP నెట్‌వర్క్  అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దేశవ్యాప్తంగా  ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు: www.abplive.com
మరిన్ని వివరాల కోసం, అధికారిక  మైక్రో సైట్‌ను సందర్శించవచ్చు: https://www.abpideasofindia.com/

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
Robinhood OTT Partner: నితిన్ 'రాబిన్ హుడ్' ఓటీటీ డీల్ ఫిక్స్! - థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
నితిన్ 'రాబిన్ హుడ్' ఓటీటీ డీల్ ఫిక్స్! - థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
NTR: జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
BR Shetty Story: 12 వేల కోట్ల వ్యాపారాన్ని 74 రూపాయలకు అమ్మేశాడు - నమ్మలేరా - బీఆర్ షెట్టి కథ మీరే చదవండి!
12 వేల కోట్ల వ్యాపారాన్ని 74 రూపాయలకు అమ్మేశాడు - నమ్మలేరా - బీఆర్ షెట్టి కథ మీరే చదవండి!
Embed widget