అన్వేషించండి
Brahmamudi Serial Today February 22nd Episode Highlights: కోర్టులో దోషిలా రాజ్..అనామికపై ఫోకస్ పెట్టిన కావ్య - బ్రహ్మముడి ఫిబ్రవరి 22 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 21st Episode: సామంత్ హత్య కేసులో రాజ్ అరెస్టవడంతో కీలక మలుపు తిరిగింది బ్రహ్మముడి .అనామిక కుట్ర నుంచి రాజ్ ను... కావ్య-అప్పు కాపాడగలరా...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Brahmamudi Serial Today February 22nd
1/11

సామంత్ హత్యకేసులో రాజ్ ను అరెస్ట్ చేసి అప్పు తీసుకెళుతుంటే..నిన్ను ఉరికంభం ఎక్కించేంతవరకూ వదలను అంటూ శాపనార్థాలు పెడుతుంది అనామిక. మీడియా వాళ్లు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే వాళ్లను తప్పించి తీసుకెళిపోతుంది అప్పు
2/11

కావ్య ఏడుస్తుంటే నువ్వు బాధపడకు లాయర్ తో మాట్లాడుతా అని చెబుతాడు సుభాష్. స్వప్న నుంచి కాల్ రావడంతో కనకం ఏంటో ఇవాళ వాన పడుతుందేమో అని సెటైర్ వేస్తుంది. ఇక్కడ తుఫాన్ వచ్చిందని జరిగినదంతా చెబుతుంది స్వప్న.
3/11

ఇప్పుడే బయలుదేరి అక్కడకు వస్తానని కనకం అంటే..ఇక్కడంతా అప్పుపై కోపంగా ఉన్నారు నువ్వు వస్తే అంతా నిన్ను తిడతారు ఆపేస్తుంది
4/11

సుభాష్, కావ్య స్టేషన్ కి వెళతారు. SI ని కలవాలని అనిడిగితే లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పడంతో వెయిట్ చేయిస్తారు.
5/11

రాత్రి పూట మీరొక్కరే వెళ్లారని మీ భార్య చెప్పారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది అప్పు. నా తమ్ముడు లిరిక్ రైటర్, నా మరదలు పోలీస్ ఆఫీసర్ అయిందన్న సంతోషంలో మేం పార్టీ చేసుకుంటుంటే కాల్ వచ్చిందంటూ జరిగింది చెబుతాడు.
6/11

తర్వాత ఎక్కడికైనా వెళ్లారా అని అడిగితే..కార్లోకి డెడ్ బాడీ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తుంది. సామంత్ ని మీరే చంపారని అనామిక కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందని అడుగుతుంది. కోపంలో అన్న మాట పట్టుకుని నన్ను ఇందులో ఇరికించారని బాధపడతాడు.
7/11

అందరకన్నా మీమ్మిల్ని నమ్మేది నేనే బావా అని మనసులో అనుకుంటూ బయటకు తీసుకొస్తుంది. బావ ఈ హత్య చేయలేదు అనేందుకు ఒక్క సాక్ష్యం లేదక్కా చిన్న క్లూ ఉన్నాబావుండేది అనేసి వెళ్లిపోతుంది.
8/11

ఎవరో కావాలనే ఇదంతా చేశారు.. ఇదంతా అనామికపనే అని నా అనుమానం. సామంత్ కనిపించలేదు అనగానే నాపై కంప్లైంట్ ఇచ్చింది, నేరుగా పోలీసులు వచ్చి తనిఖీచేశారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అంటాడు రాజ్.
9/11

స్టేషన్ బయట కావ్య బాధపడుతుంటే అనామిక వస్తుంది. ఇదంతా ప్లాన్ చేసి నేనే రాజ్ ని ఇరికించాను అనుకుంటున్నావా అంటుంది అనామిక. ఆ హత్య నువ్వే చేసి ఉంటావ్ అంటాడు సుభాష్. రాజ్ కి ఉరిశిక్ష పడేవరకూ వదిలిపెట్టను అంటుంది అనామిక.
10/11

ఇంట్లో అంతా బాధలో కూర్చుంటారు..ఇంతలో అప్పు వస్తుంది. ఈ ఇంటికి నిన్ను రప్పించడానికి మా రాజ్ ఎంతో కష్టపడ్డాడు.. అలాంటిది వాడినే అరెస్ట్ చేశావంటూ ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. రుద్రాణి కూడా అప్పుని టార్గెట్ చేస్తుంది.
11/11

బ్రహ్మముడి ఫిబ్రవరి 24 సోమవారం ఎపిసోడ్ లో... కోర్టులో రాజ్ ని దోషిగా తేల్చేలా వాదనలు నడుస్తుంటాయ్
Published at : 22 Feb 2025 08:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion