అన్వేషించండి
Ram Charan Visit Tirumala: పుట్టినరోజున తిరుపతి వెంకన్న సన్నిధిలో కుమార్తెతో రామ్ చరణ్ దంపతులు
Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజున ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భార్య ఉపాసన, కుమార్తె క్లింకారాతో కలిసి తిరుమలకు వెళ్లారు. d

తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు. తన పుట్టినరోజు సందర్భంగా భార్య, కుమార్తెతో వెంకన్న సన్నిధికి వెళ్లారు చరణ్. ఆ ఫోటోలు చూడండి.
1/6

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన దంపతులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆలయానికి కుమార్తెతో పాటు వెళ్లి స్వామి సన్నిధిలో కాసేపు గడిపారు. ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా స్వామి సేవలో తరించారు.
2/6

జూన్ 20న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించారు. ఆ అమ్మాయికి క్లింకారా అని నామకరణం చేశారు. అయితే... ఇప్పటి వరకు అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. చిన్నారికి దిష్టి తగలకుండా చూస్తున్నారు.
3/6

రామ్ చరణ్ కు భక్తి ఎక్కువ. ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటారు. శబరిమల స్వామి సన్నిధికి వెళ్లి వస్తుంటారు. తిరుమల తిరుపతి వెంకన్నను సైతం దర్శించుకుని మొక్కులు చెల్లించడం ఆయనకు అలవాటు.
4/6

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రామ్ చరణ్
5/6

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో అల్లూరి సీతారామ రాజు వేషధారణలో రామ్ చరణ్. ఈ క్యారెక్టర్, అందులో నటన ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
6/6

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC 16 movie బర్త్ డే విషెష్ చెబుతూ విడుదల చేసిన ఫోటో
Published at : 27 Mar 2024 08:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion