Actress Annapurnamma: 'ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరు' - మీడియాలో హైలెట్ కావడానికే అలా వస్తున్నారంటున్న సీనియర్ నటి అన్నపూర్ణమ్మ
Senior Actress Annapurnamma: సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల అంశంపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరని.. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు వస్తాయని అన్నారు.

Actress Annapurnamma Says No One Force In The Industry: సినీ ఇండస్ట్రీలో అయితే ఎవరూ బలవంతం చేయరని టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma) అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్ అంశంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీడియాలో హైలెట్ కావడానికే కొంతమంది కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారని అన్నారు.
'అది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది'
ప్రస్తుతం కమిట్మెంట్ అనే మాట విని రోత పాత చింతకాయ పచ్చడిలా అయిపోయిందని.. 20 ఏళ్ల ముందు కమిట్మెంట్ అడిగిన వారు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారని అన్నపూర్ణమ్మ అన్నారు. 'ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరు. ఇప్పుడన్నా కనబడదాంలే.. ఈ వ్యవహారంలోనైనా టీవీల్లో నిలబడదాం అని హైలెట్ కావాలనే కొందరు బయటకు వస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావనేది నేను నమ్మను. ఇండస్ట్రీ మనందరిదీ దాన్ని కరెక్టుగా వినియోగించుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. ఒకరు ఇష్టపడకుండా అన్యాయం జరిగింది అనే మాటకు ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడే సూటిగా చెప్పగలిగే ధైర్యం ఉండాలి.' అని పేర్కొన్నారు.
'అప్పట్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవి'
అప్పట్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవని.. దాన్ని కమిట్మెంట్ అనరని సంబంధ బాంధవ్యాలకు కూడా విలువ ఎక్కువని అన్నపూర్ణమ్మ చెప్పారు. తాను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్‌కు పని చేశాను కాబట్టి తనను ఎవరూ అలా అడగలేదని అన్నారు. కమిట్మెంట్ అనేది మన మనసు మీద ఆదారంపడి ఉంటుందని.. ఈ గోలంతా ఎదుటి మనిషిని బట్టి.. మన స్వార్థం బట్టి కూడా ఉంటుందని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పటి జనరేషన్‌కు ఇప్పటికి అదే తేడా..
తన సినీ కెరీర్ గురించి మాట్లాడిన అన్నపూర్ణమ్మ.. అప్పటి తరానికి ఇప్పటి జనరేషన్‌కు మధ్య తేడాను వివరించారు. 'ఇప్పుడు వచ్చే దర్శకులందరూ మేం నటించేటప్పుడు చిన్న వారు. సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న వారు అగ్ర నటులను తమ సినిమాల్లో పెట్టాలను అనుకుంటారు. అలాంటి వారు ఇప్పుడు తమ సినిమాల్లో సీనియర్ నటులను తీసుకోవాలని భావిస్తారు. అప్పట్లో చేసింది శ్రమ అయితే.. ఇప్పుడు చేస్తోన్న రోల్స్ లాభం. ఇప్పటికీ నా తోటి సీనియర్ నటులంతా నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్లంతా నా కుటుంబం అనే ఆలోచన తప్ప వేరే ఏదీ లేదు.' అని ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.
అన్నపూర్ణమ్మ అసలు పేరేంటో తెలుసా..?
అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి తరం సీనియర్ హీరోలతో పాటు ఇప్పటి తరం హీరో హీరోయిన్లకు సైతం తల్లిగా, అత్తగా, వదినగా, అమ్మమ్మగా ఎన్నో రోల్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల్లోనూ పలు రోల్స్ చేస్తున్నారు. ఆమె అసలు పేరు ఉమా మహేశ్వరీ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కమెడియన్ సప్తగిరి లేటెస్ట్ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్' అన్నపూర్ణమ్మ కీలక పాత్ర పోషించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

