AP EAPCET 2025 Application: ఏపీ ఎప్‌సెట్-2025 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, అప్లికేషన్ చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఎప్‌సెట్-2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

AP EAPCET 2025 Application Dates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2025 నోటిఫికేషన్ మార్చి 12న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి రూ.1000 ఆలస్యరుసుముతో మే1 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో మే 7 వరకు, రూ.4000 ఆలస్యరుసుముతో మే 12 వరకు, రూ.10,000 ఆలస్యరుసుముతో మే 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 19 నుండి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎప్‌సెట్ ద్వారా 2025 విద్యాసంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) - 2025
ప్రవేశాలు కల్పించే కోర్సులు:
➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ & హెచ్, బీఎఫ్‌ఎస్సీ
➥ బీఫార్మసీ, ఫార్మా-డి.
➥ బీఎస్సీ (నర్సింగ్).
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి..
➥ ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2025 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
➥ అగ్రికల్చర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు (25 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది.
➥ బీఎస్సీ నర్సింగ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు, దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు..
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
➥ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.05.2025.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 06.05.2025 నుంచి 08.05.2025.
➥ రూ.1000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.05.2025.
➥ రూ.2000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.05.2025.
➥ రూ.4000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2025.
➥ రూ.10000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.05.2025.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 12.05.2025.
➥ ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు..
✦ ఇంజినీరింగ్ విభాగాలకు: 21.05.2025 - 27.05.2025.
✦ అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు: 19.05.2025 - 20.05.2025.
✦ పరీక్ష సమయం: 09.00 AM - 12.00AM, 02.00 PM to 05.00 PM
➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీ(ఇంజినీరింగ్ విభాగాలు): 28.05.2025.
➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీ(ఇంజినీరింగ్ విభాగాలు)పై అభ్యంతరాల స్వీకరణ: 01.06.2025.
➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీ(అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు): 21.05.2025.
➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీ(అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల)పై అభ్యంతరాల స్వీకరణ: 25.05.2025.
➥ ఫైనల్ ఆన్సర్ కీ: 05.06.2025.
Notification
Online Application
Instruction Booklet for Engineering
Instruction Booklet for Agriculture , Pharmacy & B.Sc(Nursing)
Engineering Stream (E) Syllabus
Agriculture & Pharmacy Stream (AP) Syllabus
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

