అన్వేషించండి
Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్ పట్టిందల్లా బంగారమే - వల్లంకి పిట్టకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, మరి ఫ్లాప్?
Kavya Kalyanram Birthday Today: కావ్య కళ్యాణ్ రామ్ బర్త్ డే ఈ రోజు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత హీరోయిన్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టింది. మరి ఫ్లాప్ ఏదో తెలుసా?

కావ్యా కళ్యాణ్ రామ్ (Image Courtesy: kavya_kalyanram / Instagram)
1/6

Happy Birthday Kavya Kalyanram: చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అయిన అందాల భామల్లో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. బాలనటిగా ఆమెకు 'స్నేహమంటే ఇదేరా' ఫస్ట్ ఫిల్మ్. అయితే, ఆ తర్వాత నటించిన 'గంగోత్రి' ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా అందులో 'వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట' ఆమెను పాపులర్ చేసింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
2/6

మెగాస్టార్ చిరంజీవితో 'ఠాగూర్' సినిమాలోనూ కావ్య కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసింది. చిరు దత్తత తీసుకున్న అమ్మాయిల్లో ఆమె ఒకరు. ప్రభాస్ 'అడివి రాముడు', శ్రీకాంత్ 'లేత మనసులు', బాలకృష్ణ 'విజయేంద్ర వర్మ' & 'పాండురంగడు', పవన్ కళ్యాణ్ 'బాలు', అల్లు అర్జున్ 'బన్నీ', వెంకటేష్ 'సుభాష్ చంద్రబోస్' సినిమాల్లో కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
3/6

కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన లాస్ట్ సినిమా 'ఉల్లాసంగా ఉత్సాహంగా'. అందులో హీరోయిన్ యంగ్ రోల్ చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
4/6

కావ్య కళ్యాణ్ రామ్ కథానాయికగా పరిచయమైన సినిమా 'మసూద'. అది బ్లాక్ బస్టర్. ఆ తర్వాత 'బలగం'లో ప్రియదర్శికి జోడీగా నటించారు. అదీ బ్లాక్ బస్టర్. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు కావ్య. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
5/6

చైల్డ్ ఆర్టిస్టుగా కావ్య కళ్యాణ్ రామ్ మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ అయ్యాక రెండు వరుస హిట్స్ కొట్టారు. ఆవిడ సక్సెస్ జర్నీకి 'ఉస్తాద్' చిన్న బ్రేక్ వేసింది. ఆ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ రాలేదు. కానీ, కావ్య నటనకు పేరు వచ్చింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
6/6

ఇప్పట్లో రిలీజయ్యే కావ్య కళ్యాణ్ రామ్ సినిమాలు ఏవీ లేవు. కొంత గ్యాప్ తీసుకుని బ్లాక్ బస్టర్ తో రావాలని ఆశిస్తున్నారట. అన్నట్టు... ఆవిడ యాక్టర్ మాత్రమే కాదు, లాయర్ కూడా! (Image Courtesy: kavya_kalyanram / Instagram)
Published at : 20 May 2024 09:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion