News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్టే! జెలెన్‌స్కీ వ్యాఖ్యలకు అర్థం అదేనా!

Russia-Ukraine War: యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

Russia-Ukraine War: 

చర్చలకు సిద్ధమే..

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia Ukriane Conflict) మొదలై 16 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గడం లేదు. దాడులు, ప్రతి దాడులతో అన్ని ప్రాంతాలు ధ్వంసమైపోయాయి. రెండు వైపులా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. యుద్ధాన్ని ఆపేందుకు పలు దేశాలు ప్రయత్నించినా అవేమీ ఫలితం చూపించలేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ...స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ రష్యాతో సంప్రదింపులకు సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం...తమ దేశ సైన్యం సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నాకే ఈ చర్చలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. అంటే...రష్యా సైనికులు అక్కడి నుంచి వెనుదిరిగితే కానీ అందుకు ఒప్పుకోనని పరోక్షంగా చెప్పారు. క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సాన్‌ ప్రాంతాలు ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్ అధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే రష్యా సైనిక చర్య మొదలు పెట్టిందో అప్పటి నుంచి అవి రష్యా చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. ఇది సాధించిన తరవాతే చర్చలకు వెళ్తామని అంటున్నారు జెలెన్‌స్కీ. ఈ కండీషన్‌కి రష్యా ఒప్పుకుంటుందా లేదా అన్న తేలాల్సి ఉంది. 

పుతిన్ మరోలా..

ఉక్రెయిన్‌పై రష్యా న్యూక్లియర్ వార్ ప్రకటించనుందా..? చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తూనే ఉన్నా...రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russia President) ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. బెలారస్‌లో ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంచాం అంటూ పుతిన్ తేల్చి చెప్పారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే...రష్యా  భూభాగంపై దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్‌ వార్‌కి దిగుతామని స్పష్టం చేశారు పుతిన్. అటు అగ్రరాజ్యం మాత్రం రష్యా అణ్వాయుధాలు వినియోగిస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని చాలా రోజులుగా వాదిస్తోంది. ఇటు పుతిన్ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. అప్పటి నుంచి బెలారస్‌ రష్యాకు హెల్ప్ చేస్తోంది. చెప్పాలంటే...ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ఇది "లాంఛ్‌ప్యాడ్‌"గా మారింది. పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించే యోచనలో ఉంది రష్యా. "మాపైన వ్యూహాత్మకంగా గెలవాలని చూసే వాళ్లకు ఇదో వార్నింగ్" అని పుతిన్ స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా అలజడి రేపుతోంది. "మీరు ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారా..?" అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పుతిన్. 

"ప్రపంచం మొత్తాన్ని భయపెట్టాల్సిన అవసరం మాకేముంది..? ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రష్యా భూభాగంపై దాడి చేయాలని, ఆక్రమించుకోవాలని చూసినప్పుడు అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకాడం"

- పుతిన్, రష్యా అధ్యక్షుడు 

Also Read: ఆర్నెల్లలో 2 లక్షల మంది ఉద్యోగాలు ఉఫ్, ప్రపంచవ్యాప్తంగా ఇదే గుబులు

Published at : 02 Jul 2023 01:45 PM (IST) Tags: Russia Russia Ukraine Conflict Ukriane Russia - Ukraine War Zelensky Russia-Ukraine Conflict

ఇవి కూడా చూడండి

ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్‌ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం

ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్‌ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం

Gaza: ఇజ్రాయేల్‌ హమాస్ మధ్య మరో డీల్! మరికొంత మంది బందీల విడుదలకు చర్చలు?

Gaza: ఇజ్రాయేల్‌ హమాస్ మధ్య మరో డీల్! మరికొంత మంది బందీల విడుదలకు చర్చలు?

Gaza: ఓసారి గాజాకి రండి, ఇజ్రాయేల్‌ ఎంత నాశనం చేసిందో తెలుస్తుంది - మస్క్‌కి హమాస్‌ కౌంటర్

Gaza: ఓసారి గాజాకి రండి, ఇజ్రాయేల్‌ ఎంత నాశనం చేసిందో తెలుస్తుంది - మస్క్‌కి హమాస్‌ కౌంటర్

US H-1B Visa: ఇకపై అమెరికాలోనే H-1B వీసాల రెన్యువల్, భారతీయులకు గుడ్‌న్యూస్

US H-1B Visa: ఇకపై అమెరికాలోనే H-1B వీసాల రెన్యువల్, భారతీయులకు గుడ్‌న్యూస్

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

టాప్ స్టోరీస్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Exit Poll 2023 Highlights :   ఏబీపీ  సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ -  తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !