Viral News: 2 వారాల కిందటే పెళ్లి - భర్తను చంపడానికి సుపారీ ఇచ్చేసింది - ఈ భార్య చాలా వయోలెంట్ !
Crime News: పెళ్లి అయి రెండు వారాలు అంటే నవ వధువు కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి.కానీ ఆ వధువు మాత్రం తన భర్తను చంపేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్స్ ను మాట్లాడుకుంది.

UP Woman Hires Killer To Murder Husband: ఓ వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు అతన్నే పెళ్లి చేసుకోవాలి. అంతే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపడమో.. చంపించడమో చేసి..తర్వాత లవర్ తో సెటిలైపోవాలని అనకుంటే అది చాలా వయోలెంట్ ఆలోచన అవుతుంది. చివరికి జైలు జీవితం ఖరారవుతుంది. దీనికి ప్రగతి యాదవ్ అనే యువతి జీవితమే ఉదాహరణ.
రెండు వారాల కిందట ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ప్రగతి యాదవ్
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిదన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ ప్రేమికులు. నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.కానీ ఒకే కులం అయినప్పటికీ ఈ ప్రేమను వారి తల్లిదండ్రులు ఆమోదించలేదు. ప్రగతి యాదవ్ కు ఇష్టం లేకపోయినా బెదిరించి.. మార్చి 5న దిలీప్ అనే యువకుడితో పెళ్లి చేయించేశారు.
పధ్నాలుగో రోజు భర్తను సుపారీ ఇచ్చి చంపించేసిన ప్రగతి యాదవ్
మార్చి ఐదో తేదీన పెళ్లి అయితే మార్చి 19న నవ వరుడు దిలీప్ పొలంలో బుల్లెట్ గాయాలతో పడి ఉండటాన్ని కొంత మంది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని ఇక బతకడం కష్టమని చెప్పడంతో మార్చి 20న ఔరయ్యలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు తర్వాత దిలీప్ చనిపోయాడు.
పోలీసుల దర్యాప్తులో బయట పడిన నిజం
తన సోదరుడ్ని కావాలని చంపేశారని .. అతనికి శత్రువులు ఎవరూ లేరని .. దిలీప్ సోదరుడు సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్ తో పెళ్లి తర్వాత ప్రగతి యాదవ్ తన లవర్ ను కలవలేకపోతున్నానని ఫీలయింది. అందుకే దిలీప్ ను చంపాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. ఇద్దరూ కలిసి కాంట్రాక్ట్ కిల్లర్ ను మాట్లాడుకున్నారు. రామాజీ అనే వ్యక్తి ప్రగతి యాదవ్ భర్తను హత్య చేయడానికి అంగీకరించారు. ప్రగతి యాదవ్ ్తనికి రెండు లక్షల డబ్బులు ఇచ్చింది.
అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు
దిలీప్ ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న రామాజీ.. ఆయనను కిడ్నాప్ చేసి బైక్‌పై పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ తీవ్రంగా కొట్టి కాల్చి చంపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి, తరువాత అరెస్టు చేశారు. నిందితుల నుండి రెండు పిస్టల్స్, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే వదిలి వెళ్లిపోవచ్చు కానీ అమాయకంగా పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపడం ఏమిటని నెటిజన్లు ప్రగతి యాదవ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.





















