By: Ram Manohar | Updated at : 07 Dec 2022 01:22 PM (IST)
ఓ వృద్ధ జంట ఓపెన్ జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. (Image Credits: Instagram)
Viral Video:
ఓపెన్ జిమ్‌లో..
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంటే...వృద్ధాప్యంలోనూ "లవ్ బర్డ్స్"లా జీవితాన్ని ఆస్వాదించొచ్చు. ఇదే నిరూపిస్తున్న ఓ వృద్ధ జంట. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వృద్ధ జంట యంగ్ కపుల్‌లో పార్క్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఓ ఓపెన్ జిమ్‌కి వృద్ధ దంపతులు వచ్చారు. వ్యాయామం చేశారు. అయితే...పెద్దాయన ఎక్సర్‌సైజ్ చేస్తూ ఓ మెషీన్‌పై అటు వైపు తన భార్యను కూర్చోబెట్టి...కిందకు పైకి ఊపుతూ వ్యాయామం చేశాడు. ఆమె ఆ మెషీన్‌పై కూర్చుని ఆస్వాదిస్తూ ఉంది. ఆ పెద్దాయన కాసేపు వ్యాయామం చేశాడు. ఆ పార్క్‌కి వచ్చిన మరో వ్యక్తి ఇదంతా గమనించి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే అది వైరల్ అయిపోయింది. ఇప్పటికే 30 లక్షల మంది ఈ వీడియోను చూడగా...4 లక్షల లైక్‌లు వచ్చాయి. "మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. గాడ్ బ్లెస్ యూ" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. "ప్రేమకు వయసుతో సంబంధం లేదు" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..మరో నెటిజన్.."నా మనసు కరిగిపోయింది" అంటూ కామెంట్ చేశాడు.
మరో వైరల్ వీడియో..
బాహుబలి సినిమాలో భుజంపైన శివ లింగాన్ని పెట్టుకుని ప్రభాస్ నడిచే సీన్ చాలా హైలెట్ అయింది. అయితే తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు పైకి ఎక్కించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అయిపోయారు. సాధారణంగా బైక్‌ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు. అలాంటిది ఓ వ్యక్తి బైక్‌ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు. ముందుగా బైక్‌ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై బైక్‌ను దించేశాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఈ వీడియోలో కనిపించే బైక్ నంబర్ ప్లేట్ చూస్తే ఆ ద్విచక్ర వాహనం ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది. ఎలాంటి సాయం లేకుండా బైక్‌ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని 'సూపర్ హీరో' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
They are really super human 👏🔥❤️ pic.twitter.com/kNruhcRzE1
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 25, 2022
Also Read: Gujarat Polls: భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్లో కాంగ్రెస్‌తో ఆమ్ఆద్మీ పొత్తు!
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
ABP Desam Top 10, 1 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?
Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది
Gold-Silver Price 01 February 2023: బడ్జెట్ ఎఫెక్ట్ - తగ్గిన పసిడి, వెండి రేటు
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం