అన్వేషించండి

Top Headlines Today: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం- ఏపీ ప్రభుత్వంపై ప్రధానికి వైసీపీ ఎంపీ ఫిర్యాదు- నేటి టాప్‌ 10 న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today:

తెలంగాణలో ఐటీ రైడ్స్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ కలకంల రేపుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎల్‌ఆర్‌ నివాసం ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయనతోపాటు బడంగపేట్‌ మేయర్‌ పారిజాతం ఇంటిలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి పారిజాతం ఇంట్లో లేరని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బీజేపీకి గడ్డుకాలం 

తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాలు ఇంత నిరాశాజనకంగా ఉంటాయనిఆ పార్టీ క్యాడర్ ఏ మాత్రం అనుకోలేదు. పోలింగ్‌కు నెల రోజులు కూడా లేదు సీనియర్లు మొత్తం ఒకరి తర్వాత ఒకరు పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు. ఉన్నవారు తాము పోటీ చేసేది లేదని నేరుగా చెబుతున్నారు. పోనీ ఇతర పార్టీల్లో టిక్కెట్లు దొరకని  వారు అయినా వస్తారేమో అని అదే పనిగా ఎదురు చూస్తున్నా.. చివరి క్షణం వరకూ ఒకరిద్దరు కూడా రావడం లేదు. వచ్చిన వారు పొటెన్షియల్ క్యాండిడేట్సా కాదా అని తర్జనభర్జన పడాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో  బీజేపీలో తెలియని నిర్లిప్తత ఏర్పడిపోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ప్రధానికి రఘురామకృష్ణ రాజు లేఖ

ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు.   తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడి జరిపిన అధికారుల్లో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్నారని ఫిర్యాదు చేశారు. లోకసభ నేతగా ప్రధాని తనపై జరిగిన దాడిపై సీబీఐ, ఎన్‌ఐఏల దర్యాప్తుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా తనపై జరిగిన దాడి పట్ల విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఓట్ల పోలరైజేషన్

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి తమ సత్తా చూపించాలని ఓ పది పార్టీలు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీల మరీ అనామకలైన వారి చేతుల్లో లేవు. కాస్తంత గుర్తింపు కలిగిన వారి చేతుల్లోనే ఉన్నాయి.కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చాలా పార్టీలు చేతులెత్తేశాయి. తెలంగాణ ఏర్పడిన తొలి సారి 2014లో జరిగిన ఎన్నికల్లో పది పార్టీలకు ప్రాతినిధ్యం దక్కింది. కానీ ఇప్పుడు రెండు, మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు నెగ్గడం కష్టమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగినా .. వాటి బలం మాత్రం తరిగిపోయింది. అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేని పరిస్థితికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. నవంబరు నెలాఖరులోగా గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ నవంబరు 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా నోటిషికేషన్ల విడుదలకు సీఎం జగన్ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా గ్రూప్‌ 1, 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ల విడుదలకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

ఖమ్మంలో కీలక ప్రకటన 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 30 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు ప్రచారం చేస్తుండగా..  ముఖ్యనేతలందరూ వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలపైనే పార్టీలన్నీ దృష్టి పెట్టగా.. సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు సమయం ఉండగానే సీఎం కేసీఆర్ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని బుధవారం ప్రకటించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద నిర్ణయాలతో పాటు కాంట్రవర్సీ కామెంట్స్‌తో టాప్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఆమె చేసే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. దేశంలోని రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే మమతా.. బీజేపీతో పాటు మోదీ టార్గెట్‌గా ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కొడితే సెమీఫైనల్‌కే

ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్‌ సేన.. శ్రీలంకను ఢీ కొట్టబోతుంది. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన తర్వాత తొలిసారి భారత్‌-శ్రీలంక తలపడబోతున్నాయి. కానీ 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక-భారత్‌ సమఉజ్జీలుగా ఉండగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో ఊపు మీదుండగా.. శ్రీలంకను వరుస పరాజయాలు వీడడం లేదు. రోహిత్‌ సేన ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. లంకేయులు మాత్రం ఆడిన ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు అసలు శ్రీలంక కనీస పోటీ ఇవ్వగలుగుతుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా.. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్‌ చేరాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బాయ్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇకపై బ్యాచిలర్ కాదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో నుంచి ఆయనను హ్యాపీగా తీసేయవచ్చు. సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠితో ఆయన ఏడు అడుగులు వేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మంచు విష్ణు హెల్త్‌ అప్‌డేట్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇటీవల షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'కన్నప్ప' సినిమా చిత్రీకరణ సమయంలో విష్ణుకు ప్రమాదం జరిగిందని, యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయని, దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారని ప్రచారం జరిగింది. విష్ణుకు ఏమైందో అని మంచు అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో విష్ణు ఆరోగ్యంపై స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget