Varun Tej Lavanya Tripathi Wedding : వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ - లావణ్య... ముందు మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకుని!
Varun Tej Lavanya Wedding Photo : వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి కొన్ని క్షణాల క్రితం వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.
Varun Tej Lavanya Tripathi Wedding: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇకపై బ్యాచిలర్ కాదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో నుంచి ఆయనను హ్యాపీగా తీసేయవచ్చు. సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠితో ఆయన ఏడు అడుగులు వేయనున్నారు.
ఇటలీలో ఒక్కటైన వరుణ్, లావణ్య
నవంబర్ 3, బుధవారం... ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ రోజు రాత్రి 7.18 గంటలకు... శుభ ముహూర్తాన లావణ్య శిరస్సు మీద వరుణ్ తేజ్ జీలకర్ర బెల్లం పెట్టారు. మెడలో మూడు ముడులు వేసి ఏడు అడుగులు నడిచారు. లావణ్యా త్రిపాఠి తల్లిదండ్రులు డియో రాజ్, కిరణ్ త్రిపాఠి కన్యాదానం చేశారు.
కొత్త జంట ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ తమ తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని జీవితం ప్రారంభించారు. పెళ్లి తర్వాత అక్కడే రిసెప్షన్ కూడా మొదలైంది.
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లికి సుమారు 120 మంది అతిథులు హాజరైనట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు, బంధు మిత్రులతో పాటు చిత్రసీమ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు & అల్లు అర్జున్ స్నేహా రెడ్డి దంపతులు ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సుస్మితా కొణిదెల, నిహారిక... మెగా కజిన్స్ అందరూ అటెండ్ అయ్యారు.
ఇండస్ట్రీ హీరోలలో నితిన్ ఒక్కరే!?
చిత్రసీమలో వరుణ్ తేజ్ స్నేహితులతో నితిన్ ముఖ్యమైన వ్యక్తి. పెళ్ళికి ఆయన వెళ్లారు. తన కొత్త సినిమా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' టీజర్ కూడా అక్కడ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వీడియో విడుదల చేశారు. నీరజా కోన కూడా వివాహానికి హాజరయ్యారు.
Also Read : సంక్రాంతి బరిలో మహేష్ సినిమాకు ప్రయారిటీ... నేనెందుకు వేరే నిర్మాతలను అడగాలి? - నిర్మాత నాగవంశీ
ఇటలీలో వరుణ్ లవ్ (Varun Lav) పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి. సోమవారం కాక్ టైల్ పార్టీ... మంగళవారం హల్దీ & మెహందీ వేడుకలు బంధు మిత్రుల సమక్షంలో సంతోషంగా జరిగాయి. ఆల్రెడీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 5న భాగ్య నగరంలో రిసెప్షన్!
పెళ్ళైన నాలుగు రోజులకు కొత్త జంట హైదరాబాద్ వస్తారు. వివాహానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో సిటీలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు కూడా పంపారు. కార్ పాస్ కూడా ఇవ్వడం విశేషం.
వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు వస్తే... 'ఆపరేషన్ వేలంటైన్' షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ 50 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం గమనార్హం. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా 'మట్కా' చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.