అన్వేషించండి

Morning Top News : రేపటి నుంచే ఏపీలో పల్లె వారోత్సవాలు, టీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్ వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Todays Top 10 news: 
 
1. రేపటి నుంచే పల్లె వారోత్సవాలు..
ఏపీవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నారు. 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లెపండుగ వారోత్సవాలు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. సీసీ రోడ్లతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
2. చంద్రబాబును కలిసిన చిరంజీవి
ఏపీ సీఎం చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి తన తరపున 50 లక్షలు, రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. దీంతో చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఎప్పుడూ ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంతకు ముందు విరాళం చెక్కులు అందించేందుకు సీఎం నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
3. ఏపీకి భారీ వర్ష సూచన 
నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 14న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, ఏపీ తీరాల వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14, 15, 16వ తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
4. స్వగ్రామంలో రేవంత్ అభివృద్ధి పనులు
స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని కోట మైసమ్మను దర్శించుకుని జమ్మిచెట్టుకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, అంతకముందు గ్రామంలో రూ.72 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనం, రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.45లక్షలతో బీసీ సామాజిక భవనం, రూ.45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల భవనాలను సీఎం ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
5. జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ తల్లి బీబీజాన్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను నెల్లూరు బొల్లినేని ఆసుపత్రికి తరలించగా, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బీబీజాన్ వెంట జానీ మాస్టర్ సతీమణి అయేషా ఉన్నారు. కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కొడుకు జైలుకు వెళ్లడంతో బీబీజాన్ బెంగతో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
6. మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. దీంతో ఆయన దాదాపు తొమ్మిదేళ్ళ పాటు జైలులోనే ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
7.హరిహర వీరమల్లు’ నుంచి  అదిరే అప్‌డేట్ 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. త్వరలో బ్యాటిల్ ఆఫ్ ధర్మ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ విల్లు ఎక్కుపెట్టి నిప్పు అంటించిన బాణాలు వదులుతున్నట్టు ఉంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
8 . భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 298 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 రన్స్ మాత్రమే చేసింది. హిర్దోయ్‌(63), దాస్(42) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత్ బౌలర్లలో బిష్ణోయ్ 3, మయాంక్ 2, సుందర్, నితీష్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
9. చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా
ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన మూడో T20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించి పలు రికార్డులను నమోదు చేసింది. *టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297) *టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్ (297) *భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22) *భారత జట్టు తరఫున ఫాస్టెస్ట్ 100(7.2 ఓవర్లు) *భారత తరఫున ఫాస్టెస్ట్ 200(13.6 ఓవర్లు).పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
10. డీఎస్పీ‌గా మహ్మద్ సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా నిన్న(శుక్రవారం) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) సిరాజ్ డీఎస్పీగా యూనిఫాం ధరించారు. దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. గ్రూప్-1 ఉద్యోగంతో పాటు, 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Vs Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Vs Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
Proffessor Saibaba: ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
Harihara Veeramallu: స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి - సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి - సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం
Tragedy Incidents: పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
Embed widget