అన్వేషించండి

Harihara Veeramallu: స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!

Harihara Veeramallu First Single: దసరా పండుగ సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. అలాగే త్వరలో ఫస్ట్ సింగిల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Pawan Kalyan Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాల్లు ముందుగా రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. 2025 మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. అలాగే ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఈ పాట పాడింది ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం.

‘కొడకా కోటేశ్వర్రావా’ తర్వాత...
పవర్ స్టార్ పవన్ కళ్యాణే ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ స్వయంగా పాడారట. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా తెలిపింది. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చివరిగా ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కొడకా కోటేశ్వర్రావా అనే పాట పాడారు. అంతకు ‘అత్తారింటికి దారేది’లో సూపర్ హిట్ సాంగ్ ‘కాటమ రాయుడా’, అంతకు ముందు ‘పంజా’లో ‘పాపారాయుడు’ పాటలను కూడా పవన్ కళ్యాణ్ పాడారు. కెరీర్ ప్రారంభంలో కూడా తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కి పవన్ కళ్యాణ్ గాత్రదానం చేశారు. దీంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఫస్ట్ సింగిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Readమెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్

పవన్ సినిమాలు ఏ ఆర్డర్‌లో రిలీజ్ అవుతాయి?
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతానికి పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. అవే ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీటిలో మొదటిగా ‘ఓజీ’ విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. 2025 మార్చి చివరి వారంలో ‘ఓజీ’ విడుదల కానుందని నిర్మాత దానయ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. కానీ సడెన్‌గా ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఫ్రంట్ సీట్ తీసుకుంది. 2025 మార్చి చివరి వారంలో ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదల కానుంది.

దీంతో ‘ఓజీ’ని వాయిదా వేయడం నిర్మాతలకు తప్పలేదు. 2025 ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ‘ఓజీ’ విడుదల అవుతుందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు డేట్స్ ఇస్తే ‘ఓజీ’ మొత్తం పూర్తి అయిపోతుందని తెలుస్తోంది. మరి పవన్... సుజీత్‌కు ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ వర్క్ పెండింగ్ ఉన్నది ‘ఉస్తాద్ భగత్ సింగ్’కే. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. మరి ఈ సినిమా ఎప్పుటికి పూర్తయ్యేనో చూడాలి.

ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏంటి?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ కొత్త సినిమాలూ ఒప్పుకోవడం లేదు. మరి ఈ మూడు సినిమాల తర్వాత అసలు సినిమాలు చేస్తారో లేదో తెలియదు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే ‘హరిహర వీరమల్లు పార్ట్  2’ కూడా చేయాల్సి ఉంది. ఆ సినిమాలు చేస్తారో లేదో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.

Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మానవ అవశేషాలు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మానవ అవశేషాలు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Telangana News: రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కిషన్ రెడ్డి క్లారిటీ
Singer Kalpana: 'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy Final Preview | మినీ వరల్డ్ కప్పును ముద్దాడేది ఎవరో..? | ABP DesamInd vs NZ CT Final 2025 | వన్డేలకు వీడ్కోలు పలకనున్న రోహిత్, కొహ్లీ.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మానవ అవశేషాలు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మానవ అవశేషాలు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Telangana News: రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కిషన్ రెడ్డి క్లారిటీ
Singer Kalpana: 'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
Naga Babu Net worth: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
Hindu Temple Vandalised in US: అమెరికాలో హిందూ ఆలయాన్ని కూల్చివేసిన అల్లరి మూక, ముందు గోడలపై పిచ్చి రాతలు
అమెరికాలో హిందూ ఆలయాన్ని కూల్చివేసిన అల్లరి మూక, ముందు గోడలపై పిచ్చి రాతలు
Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Nani: ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
Embed widget