చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నేడు 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ‘యానిమల్’ రణ్‌బీర్‌ని కెరీర్‌లో వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. దీంతో రణ్‌బీర్ దేశంలోనే పెద్ద స్టార్లలో ఒకడిగా మారాడు. రణ్‌బీర్ తర్వాతి లైనప్ కూడా మామూలు లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ‘రామాయణం’ కూడా ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. క్రేజీ ప్రాజెక్ట్ ‘ధూమ్: 4’ విలన్‌గా నటించే గోల్డెన్ ఛాన్స్ రణ్‌బీర్‌కు వచ్చిందని తెలుస్తోంది. ‘ధూమ్’ సిరీస్‌లో హీరో కంటే విలన్‌కే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ కూడా వీటి తర్వాత ఉంటుంది. ఈ లైనప్ చూశాక రణ్‌బీర్‌ను ఆపడం ఎవరికైనా సాధ్యం అవుతుంది అంటారా?