‘బ్రహ్మముడి’ సెప్టెంబరు 28 ఎపిసోడ్

రాజ్ - కావ్య ముద్దు ముచ్చట.. అనామికకు చెక్ ఇక!

Published by: RAMA

బ్రహ్మముడి

ఆఫీస్‌లో ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన రాజ్..అగ్రెసివ్ గా డెసిషన్ తీసుకుంటే మీ ప్లేస్ లో కొత్తవారిని తీసుకోవడం ఎంతసేపు...మిమ్మల్ని రోడ్డున పడేయడం ఇష్టం లేదు..ఈసారి ఎక్స్ పో లో మన డిజైన్లు హైలెట్ కావాలని ఆర్డర్ వేస్తాడు.

బ్రహ్మముడి

ఈసారి పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకుంటున్నాం..డిజైన్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని కావ్యకు చెబుతాడు సామంత్ మేనేజర్. తప్పనిసరిగా మంచి డిజైన్లు వేసిస్తానంటుంది కావ్య

బ్రహ్మముడి

ఎక్స్‌పో సీఈవో దగ్గరికి వెళ్తున్న రాజ్‌కు ఎదురైన సామంత్..ఈ సారి అవార్డ్ మీ కంపెనీ కాదు మేం కొడతాం అని సవాల్ చేస్తాడు. గెలుపు నీవైపు నుంచి నావైపు వచ్చింది..నీ కంపెనీలో ఉద్యోగులు కూడా అని హింట్ ఇస్తాడు సామంత్

బ్రహ్మముడి

కావ్య డిజైన్స్ వేయడానికి ఒప్పుకుందా అని సామంత్ అడిగితే ..తన భర్త కంపెనీకి వ్యతిరేకంగా అని తెలియదు కదా అందుకే ఒప్పుకుందని క్లారిటీ ఇస్తుంది. వాడి భార్యే వాడిని ఓడిస్తుందని సామంత్ నవ్వుకుంటాడు

బ్రహ్మముడి

అప్పను పోలీస్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేందుకు తీసుకెళతాడు కవి..డబ్బులు భారీగా కట్టమనడంలో ఇవన్నీ మనకు అవసరమా అని అక్కడినుంచి కళ్యాణ్ ను తీసుకెళ్లిపోతుంది అప్పు

బ్రహ్మముడి

మన కంపెనీకి దాదాపు 12 కోట్ల నష్టం రాబోతోదంటూ ఆడిటర్ తో జరిగిన మీటింగ్ గురించి సుభాష్ కి చెబుతాడు రాజ్. అక్కడే ఉన్న రుద్రాణి.. తన కొడుకుపై నింద వేసేందుకేనా ఈ ప్లాన్ అని ఫైర్ అవుతుంది.

బ్రహ్మముడి

లాస్ ని ఎలా కవర్ చేయాలా అని ఆలోచించాను కానీ..ఎవరి కారణంగా అని ఇప్పటివరకూ పట్టించుకోలేదు.. ఇకపై తవ్వడం మొదలెడతా.. ఎవరు ఎంత మింగారో బయటపడుతుందని హెచ్చరిస్తాడు రాజ్

బ్రహ్మముడి

కంపెనీకి అవార్డ్ కోసమైనా కావ్యను తీసుకురా..తను వేసిన డిజైన్లే యూనిక్ గా ఉంటాయంటారు అపర్ణ, సుభాష్. ఆ మాత్రం డిజైన్లు రాజ్ కి చేతకాదా అని రుద్రాణి రెచ్చగొడుతుంది.. కావ్యను తీసుకొచ్చేదే లే అని తెగేసిచెబుతాడు రాజ్

బ్రహ్మముడి

మరోవైపు కావ్య డిజైన్లు వేసేందుకు కూర్చుని..రాజ్ ఊహల్లో తేలుతుంటుంది. కాన్సన్ ట్రేషన్ కుదరడం లేదన్నప్పుడు గతంలో రాజ్ ముద్దుగురించి చెప్పిన సంగతులు గుర్తుచేసుకుని మునిగితేలుతుంది

బ్రహ్మముడి

ఎంత మర్చిపోదాం అనుకున్నా ఇదేంటనే ఆలోచనలో ఉన్న కావ్య దగ్గరకు కనకం వస్తుంది. నీ మనసులో ఏముందో ఆ పేపర్ చెబుతోంది అనగానే ..నగల డిజైన్ల బదులు రాజ్ తనకు ముద్దుపెట్టిన బొమ్మ గీస్తుంది కావ్య

బ్రహ్మముడి

మరోవైపు రాజ్ కూడా కళాకృతి అని కంపెనీ పేరుకి బదులు కళావతి అని రాస్తాడు.. ఎన్ని బొమ్మలు గీసినా ఫైనల్ కాక పేపర్లన్నీ చిందరవందరగా పడేస్తాడు..అక్కడకు ఇందిరాదేవి వస్తుంది