సంబరాల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్! సంబరాల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ..సెప్టెంబర్ 27 పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో ఉండాల్సిన రోజు.. ఎందుకంటే ఓజీ ఈరోజు రావాల్సింది. ఓజీ మేకర్స్ ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్ సెప్టెంబర్ డేట్...అనుకున్నట్టుగా వచ్చి ఉంటే ఫ్యాన్స్ ఫుల్ ఫెస్టివల్ మూడ్ లో ఉండాల్సింది. మూవీస్ సెట్స్ మీదకి వెళ్లేటప్పుడు ఓ డేట్..ఆ తర్వాత మార్పులు చేసుకోవడం కామన్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OGకి డీవీవీ దానయ్య నిర్మాత. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంలై రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న పవన్ ..ఆ తర్వాత OG పై కాన్సన్ ట్రేట్ చేయనున్నారు. ఈ మూవీపై వచ్చిన ఫస్ట్ గ్లింప్ల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. మూవీ బావుంటుంది చూడండి అని ఎన్నికల ప్రచారంలో పవన్ అన్నారు కూడా.. థమన్ మ్యూజిక్ అందిస్తోన్న OG 2025 మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది... OG కన్నా ముందు హరిహరవీరమల్లు రాబోతోంది... ఇప్పటికే ఆ షూటింగ్ లో ఉన్నారు పవన్..