మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఏకంగా 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు ఆయనను ఈ రికార్డు వరించింది. కానీ చిరంజీవి కంటే ముందు గిన్నిస్ రికార్డు కొట్టిన టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. 2017లో ఒకే రోజు 102 మంది మహిళల గర్భవతి పూజలకు హాజరయి బాలకృష్ణ ఈ రికార్డు సాధించారు. విజయ నిర్మల 42 సినిమాలకు దర్శకత్వం వహించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం చేసిన మహిళా దర్శకురాలిగా నిలిచారు. ఏకంగా 40 వేలకు పైగా పాటలు రికార్డు చేసినందుకు ఎస్పీబీ కూడా గిన్నిస్ రికార్డులకు ఎక్కినట్లు తెలుస్తోంది. 76 భారతీయ భాషల్లో గజల్స్ పాడినందుకు గానూ గజల్ శ్రీనివాస్ రికార్డు సాధించాడు. 13 భారతీయ భాషల్లో 150కి పైగా సినిమాలు తీసినందుకుగానూ డి.రామానాయుడు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం 1000కి పైగా సినిమాల్లో నటించి, అత్యధిక సినిమాల్లో నటించినందుకు రికార్డుల్లోకి ఎక్కారు. గాయని పి.సుశీల ఏకంగా 17,695 పాటలు పాడారు. మోస్ట్ రికార్డెడ్ ఆర్టిస్టుగా ఆమె రికార్డు సాధించారు.