జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మొదటి రోజు కోటి వసూలు చేసిన మొదటి సినిమా దేవర.
నార్త్ అమెరికాలో 2.8 మిలియన్ డాలర్ల ప్రీమియర్ల వసూళ్లతో ‘దేవర’ ఆల్ టైమ్ టాప్-3లోకి చేరింది.
నైజాంలో కేవలం తెల్లవారుజామున ఒంటి గంట షోలకే రూ.2.36 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇది బెనిఫిట్ షోల్లో ఆల్‌టైమ్ రికార్డు.
‘దేవర’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా.
ఏపీ, తెలంగాణల్లో ఎన్నో సెంటర్లలో ‘దేవర’ ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ సాధించింది.
‘దేవర’ హిందీ వెర్షన్ రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు నెట్ సాధించే అవకాశం ఉందని అంచనా.