Revanth Reddy : సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?
Telangana : స్వగ్రామం కొండా రెడ్డి పల్లి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామంలో గడపడం ఆనవాయితీగా వస్తోంది.
Revanth Reddy initiated development works In Konda Reddy Palli : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో పెత్త ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా స్వగ్రామానికి వెళ్లిన సీఎం రేవంత్ కు గ్రామస్తులు పూల జల్లులు, డప్పు దరువులు, కొలాటాలతో ఘన స్వాగతం పలికారు.
కొండారెడ్డి పల్లె వాసుల చిరకాల అభివృద్ధి పనుల కోరికలన్నింటికీ ఆమోదం
ఈ పర్యటన సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.18 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.18కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ల రూ.64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులను ప్రారంభించారు. రూ.32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, బహిరంగ వ్యాయామశాల నిర్మాణానికి కూడా పునాది రాయి వేశారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు
గ్రామం మొత్తం జీరో కరెంట్ బిల్లు వచ్చేలా సౌర ఫలకాల యూనిట్లు
ఇక రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. అలాగే అత్యాధునిక సదుపాయాలతో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు. రూ.70 లక్షలతో అధునాత సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వాడకంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిని తొలి సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా మార్చేందుకు గ్రామస్తులందరికీ సోలార్ కిట్లు ఉచితంగా ఇస్తున్నారు.
హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమన్న వివాహిత తల్లిదండ్రులు
దసరా పండుగను సొంత ఊరిలో చేసుకోవడం ఆనవాయితీ
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారంతా తమ నియోజకవర్గానికి, గ్రామానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి అభివృద్ది చేస్తూంటారు. ఇప్పటికే కొడంగల్ అభివృద్ధి కోసం రేవంత్ భారీగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ స్వగ్రామం కొండారెడ్డి పల్లె.. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోకి రాదు. దసరా పండగును సొంత ఊరిలో జరుపుకునేందుకు రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులంతా వస్తారు. అనుముల కుటంబ సభ్యులు వంద మందికిపైగానే ఉంటారు. ఎక్కువమంది విదేశాల్లో ఉన్నప్పటికీ దసరా పండుగ కోసం ప్రతి ఏడాది స్వగ్రామానికి వస్తారు.