iPhone 17 Pro Discount Price: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. దీపావళి ఆఫర్లో తక్కువ ధరకే iPhone 17 Pro కొనేయండి
iPhone 17 Pro Price Cut: దీపావళి సందర్భంగా ఐఫోన్ 17 ప్రో కొనాలనుకునేవారికి శుభవార్త వచ్చింది. అమెజాన్‌లో దాదాపు 7000 రూపాయలు ఐఫోన్ 17 ప్రో మోడల్‌పై ఆదా చేసుకోవచ్చు.

Diwali Sales 2025 | ఇటీవల విడుదలైన ఐఫోన్ 17 ఫోన్ ధర ఎక్కువ అని ఆలోచిస్తున్నారా.. అయితే దీపావళి సందర్భంగా iPhone 17 Pro కొనడానికి మంచి అవకాశం లభించింది. గత నెలలో విడుదలైన ఈ ఐఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. దాంతో మీరు తక్కువ ధరకు ఐఫోన్ 17 ప్రో కొనుగోలు చేయవచ్చు. దీపావళి సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఐఫోన్ కొనుగోలు చేస్తే కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే లేదా దీపావళికి మీ కుటుంబ సభ్యులకు కొత్త ఐఫోన్‌ను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది మంచి అవకాశం.
iPhone 17 Pro ఫీచర్లు ఇవే
Apple నుంచి అధునాతన A19 Pro చిప్ అమర్చిన ఈ ఐఫోన్ 17 ప్రో ఫోన్లో పలు అద్భుతమైన ఫీచర్‌లు ఉన్నాయి. 6.3 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది, ఇది 39 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మోడల్ కొత్త డిజైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీని వెనుక భాగంలో 48MP+ 48MP+ 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ముందు భాగంలో సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. ఈ మోడల్ ముందు, వెనుక కెమెరాల నుండి ఒకేసారి వీడియో రికార్డింగ్ చేయవచ్చు. iOS 26తో వచ్చే ఈ ఐఫోన్ Apple ఇంటెలిజెన్స్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
iPhone 17 Pro పై బ్యాంక్ ఆఫర్‌లు
మీరు అమెజాన్ నుండి HDFC క్రెడిట్ కార్డ్ లేదా ICICI అమెజాన్ పే కార్డ్ ద్వారా ఐఫోన్ 17 ఫ్రో ఫోన్‌ను కొనుగోలు చేయాలి. తద్వారా మీరు ₹6,000 కంటే ఎక్కువ ధర తగ్గింపును పొందుతారు. అమెజాన్‌లో iPhone 17 Pro 256GB వేరియంట్ ₹1,34,900కి లిస్ట్ చేశారు. మీరు HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా EMI ద్వారా ఐఫోన్ 17 ఫ్రో కొనుగోలు చేస్తే, మీరు ₹6,750 అదనపు తగ్గింపును పొందుతారు. అదే సమయంలో మొత్తం చెల్లింపును ఒకేసారి చేస్తే మీరు ₹6,250 తగ్గింపు ధరను పొందుతారు.
ICICI కార్డ్‌పై డిస్కౌంట్ విషయానికి వస్తే మొత్తం చెల్లింపుపై ₹6,745 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో యాడ్ అవుతుంది. మీరు ఈ డీల్‌తో ఐఫోన్ 17 ప్రో మొబైల్ కొనుగోలు చేయడంతో పాటు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆఫర్ సమయంలో కొనుగోలు చేస్తే మీకు ధర ఎక్కువ అనే టెన్షన్ ఉండదు. మీకు కావాల్సిన ఫోన్ కొనుగోలు చేయవచ్చు.






















